సిరిసిల్ల జిల్లా పరిషత్, రెండు మండలాలు, ఐదు గ్రామాలకు అవార్డులు
రాజన్నసిరిసిల్ల, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లిరూరల్/ కొడిమ్యాల/ రామడుగు/ మంథనిరూరల్: అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమస్యల పరిష్కారంలో ఉత్తమ పనితీరుకు ఉమ్మడి జిల్లాకు పురస్కారాలు అందాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్, పెద్దపల్లి, కొడిమ్యాల మండల పరిషత్‌లు, ముస్తాబాద్ మండలం మద్దికుంట, తంగళ్లపల్లి మండలం మండెపల్లి, మంథని మండలం నాగారం, ముత్తారం మండలం హరిపురం, రామడుగు మండలం వెలిచాలకు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీరాజ్ స్వశక్తికరణ్ అవార్డులు వరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం రంగారెడ్డి జడ్పీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు.
రాజన్న జిల్లా పరిషత్‌కు సంబంధించి జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వైస్ చైర్మన్ సిద్ధం వేణు, డీపీవో రవీందర్, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి పురస్కారాన్ని స్వీకరించారు. అనంతరం వీరు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలువగా, ఆయన సన్మానించి, అభినందించారు.
మండల పరిషత్‌లకు సంబంధించి పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి, ఎంపీడీఓ ఎం రాజు, పెద్దపల్లి ఇన్చార్జి డీఎల్పీఓ రాంబాబు, కొడిమ్యాల ఎంపీపీ మెన్నేని స్వర్ణలత, ఎంపీడీవో పద్మజ, సింగిల్ విండో చైర్మన్ మెన్నేని రాజనర్సింగా రావు, వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్ స్వీకరించారు.
పంచాయతీలకు సంబంధించి మద్దికుంట సర్పంచ్ జనగామ భాగ్యశ్రీ, మండెపల్లి సర్పంచ్ గనప శివజ్యోతి, డీపీఓ రవీందర్‌తో కలిసి అవార్డులు స్వీకరించారు. నాగారం సర్పంచ్ సర్పంచ్ బూడిద మల్లేశ్, ఎంపీవో శేషయ్య సూరి, హరిపురం సర్పంచ్ వేల్పూరు సంపత్‌రావు, ఎంపీడీఓ శ్రీనివాస్ స్వీకరించారు. వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజన, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా పురస్కారాన్ని అందుకున్నారు. వీరివెంట టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వీర్ల వేంకటేశ్వరరావు కూడా ఉన్నారు. కాగా, పురస్కారాల ప్రదానం తర్వాత హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ను కేటీఆర్‌ను కలువగా, వారు సన్మానించి అభినందించారు.