చొప్పదండి/రామడుగు/గంగాధర, ఏప్రిల్ 23: రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి మండలం రుక్మాపూర్, వెదురుగట్ట, కొలిమికుంట, దేశాయ్‌పేట, ఆర్నకొండ, గుమ్లాపూర్, రామడుగు మండలం తిర్మలాపూర్, లక్ష్మీపూర్, దత్తోజిపేట, కొక్కెరకుంట, గంగాధర మండలం ముప్పిడినర్సయ్యపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఆయా చోట్ల ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, రైతాంగానికి అండగా ఉంటూ గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రైతులు నష్టపోవద్దనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మరోమారు అన్నదాతలకు అండగా నిలిచిన మహానుభావుడు అని కొనియాడారు.
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమాల్లో చొప్పదండి ఎంపీపీ చిలుకరవీందర్, సింగిల్ విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సర్పంచులు తాళ్లపల్లి సుజాత, గుంట రవి, లింగయ్య, ఎంపీటీసీలు కోటేశ్, లక్ష్మీనారాయణ, తిరుపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, ఆర్బీఎస్ సభ్యులు మచ్చ రమేశ్, గుడిపాటి వెంకటరమణారెడ్డి, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, కర్రె శ్రీనివాస్, మావురం మహేశ్, రాజశేఖర్, రఘుపతిరెడ్డి, కుమార్, సాగర్‌రెడ్డి, రామడుగు మండలంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ముప్పిడినర్సయ్యపల్లిలో గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, రామడుగు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, ఎంపీటీసీ దుబ్బాసి శంకరమ్మ, నాయకులు కరబూజ తిరుపతిగౌడ్, పబ్బతి తిరుపతిరెడ్డి, దుబ్బాసి బుచ్చయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.