కార్పొరేషన్, ఏప్రిల్ 23: నగరంలో శనివారం టీఆర్ఎస్ నాయకుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావు పుట్టిన రోజు వేడుకలను శనివారం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. చల్మెడ లక్ష్మీనర్సింహారావు పుట్టిన రోజును పురస్కరించుకొని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా స్థానిక తీగలగుట్టపల్లిలో ఫణిచరణ్రావు ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు మొక్కలు నాటారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న చల్మెడ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైద్య విద్యార్థులు, టీఆర్ఎస్ నాయకులు ప్రమోద్‌రావు, మల్లింకి శ్రీనివాస్, రాంబాబు, దుర్గం మనోహర్, సందీప్, అఖిల్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే, తెలంగాణ చౌక్‌లో టీఆర్ఎస్ నాయకుడు కొమ్ము సునీల్ ఆధ్వర్యంలో చల్మెడ లక్ష్మీనర్సింహారావు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హాజరై కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చల్మెడ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో దావు రామిరెడ్డి, జువ్వాడి మారుతిరావు, ఖలిద్, యాకూబ్ పాషా, గున్నాల రమేశ్, ప్రమోద్‌రావు, మూల రవీందర్‌రెడ్డి, భాసర్‌రెడ్డి, ఎనగంటి సందీప్, కుర్ర తిరుపతి, కరీం, గుమ్మడి రాజ్‌కుమార్, దుర్గం మనోహర్, రాకేశ్, విజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 23: కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్లలోని పద్మనాయక వృద్ధాశ్రమంలో వృద్ధులకు మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు జువ్వాడి మారుతి రావు ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ సింగిల్ విండో డైరెక్టర్ మూల వెంకటరవీందర్ రెడ్డి, కొమ్ము సునీల్, ఏగుర్ల బీరయ్య, చెట్టి శ్రీనివాస్, మారెళ్ల జగన్మోహన్రెడ్డి, వొడ్నాల సదానందం, నేదునూరి రాజయ్య, రాపోలు అనిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, బొమ్మకల్‌లోని చల్మెడ ఆనందరావు దవాఖాన ఆవరణలో దవాఖాన చైర్మన్ చల్మెడ లక్ష్మీనర్సింహారావు పుట్టిన రోజును పురస్కరించుకొని చల్మెడ ఆటో యూనియన్ అధ్యక్షుడు పురుషోత్తమ చారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అసీమ్ అలీ ప్రారంభించారు. అనంతరం ఆయన జన్మదిన కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ఆటో యూనియన్ నాయకులు నరేందర్, సంజీవ్, సంపత్, రమేశ్, రాజు, మారుతి, చంద్రయ్య, శ్రీను, దేవా తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్: ఏప్రిల్ 23: దుర్శేడ్ గ్రామంలో దన్నమనేని నవీన్‌రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో శ్రీ రామోజు పురుషోత్తమచారి, బుర్ర రమేశ్‌గౌడ్, బుర్ర అజయ్‌గౌడ్, ప్రసాద్, నల్ల మహేశ్, అరవింద్, హరీశ్, మధు తదితరులు పాల్గొన్నారు.