రాయికల్ రూరల్, ఏప్రిల్ 23: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాయికల్‌లో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో శనివారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఊరూరా గులాబీ జెండాలను ఎగురవేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరగా వీరికి గులాబీ కండువా లు కప్పి సాదర స్వాగతం పలికారు. నేతలు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకెళ్లి పార్టీ పటిష్టానికి కృషి చేయాలని నిర్దేశించారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్పర్సన్ జాదవ్ అశ్విని, ఏఎంసీ చైర్మన్ గన్నె రాజారెడ్డి, వైస్ చైర్మన్ కొల్లూరి వేణు, రాయికల్ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్, నాయకులు గండ్ర రమాదేవి, కొత్తపెల్లి ప్రసాద్, ముఖీద్, జాన గంగాధర్, జాన గోపి తదితరులు పాల్గొన్నారు.