గంగాధర/రామడుగు, ఏప్రిల్ 22 : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా అభివృద్ది చెందిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. శుక్రవారం గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి, బూరుగుపల్లి, చెర్లపల్లి (ఆర్), కొండాయపల్లి, చెర్లపల్లి(ఎన్), లక్ష్మీదేవిపల్లి, నాగిరెడ్డిపూర్, గంగాధర గ్రామాల్లో గంగాధర సింగిల్ విండో కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రామడుగు మండలం పందికుంటపల్లి, షానగర్ గ్రామాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రామడుగు సింగిల్‌విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయించడంలో విఫలమైన బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం వడ్లు కొనకుండా చేతులెత్తేసినా, రాష్ట్రంలో ఉన్న రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించి సీఎం కేసీఆర్ మరోసారి రైతు బాంధవుడిగా నిలిచారని కొనియాడారు. రైసు మిల్లుల యజమానులు సహకరిస్తూ రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎప్పటికప్పుడు మిల్లులకు చేరేలా చూడాలన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు సాగి మహిపాల్‌రావు, గంట్ల వెంకటరెడ్డి, గంగాధర సింగిల్ విండో అధ్యక్షుడు దూలం బాలాగౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, కొండగట్టు బోర్డు డైరెక్టర్లు బండపల్లి యాదగిరి, పుల్కం నర్సయ్య, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, తోట కవిత, ఆముదాల వెంకటమ్మ, పొట్టాల కనకయ్య, తాళ్ల విజయలక్ష్మి, పంజాల లక్ష్మి, వేముల దామోదర్, మొగుల్ల ఎల్లయ్య, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, నాయకులు దూలం శంకర్‌గౌడ్, తోట మల్లారెడ్డి, ఆముదాల రమణారెడ్డి, పంజాల ఆంజనేయులు, వేముల అంజి, రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, జారతి సత్తయ్య, ఆకుల అంజయ్య, ఎగుర్ల మల్లయ్య, పెంచాల చందు, మ్యాక వినోద్, సుంకె అనిల్, కలిగేటి లక్ష్మణ్, మామిడి తిరుపతి, పెంటి శంకర్, రాళ్ల లక్ష్మణ్, చిమ్మల్ల శ్రీనివాస్, తిరుపతి, చిమ్మల్ల శంకర్, మొగిలిపాలెం నరేశ్, మాదం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.