ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 22: బీజేపీ నాయకులు తాము చేసిన పని చెప్పుకొనే పరిస్థితి లేక అర్థం, పర్థం లేని విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. కొందరు బీజేపీ నాయకులు గురువారం మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఎల్లారెడ్డిపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ బీజేపీ నాయకులు మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించలేక, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అవాకులు చెవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం నుంచి సేకరించిన పన్నుల్లో నుంచి సగం డబ్బులు కూడా ఇవ్వకుండా అన్నీ తామే చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
అనంతరం మంత్రి కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, పట్టణాధ్యక్షుడు బండారి బాల్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు చాంద్‌పాషా, ఎంపీపీ పిల్లి రేణుక, ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్‌గౌడ్, మాజీ చైర్మన్ అందె సుభాష్, సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు పందిళ్ల నాగరాణి, ఎన్గందుల అనసూయ, నాయకులు ఎడ్ల లక్ష్మణ్, గన్నమనేని సుధాకర్‌రావు, ప్రభునాయక్, వెంకట నర్సింహా రెడ్డి, తిరుపతి నాయక్, మామిండ్ల తిరుపతిబాబు, కంకణాల శ్రీనివాస్, రాజు, నమిలికొండ నర్సింలు, మాద ఉదయ్, ఎన్గందుల నర్సింలు, అప్సరున్నీసా, నవజీవన్‌రెడ్డి, పందిళ్ల పరశురాములు, ఎడ్ల సందీప్, దొనుకుల కళ్యాణ్, చందనం శివ, సాయి, గట్ల అనిల్, గణేశ్, పసుల భాస్కర్, నంది కిషన్ పాల్గొన్నారు.