ఓదెల, ఏప్రిల్ 22: రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. కొలనూర్, ఉప్పరపల్లి, పిట్టల ఎల్లయ్యపల్లె, కనగర్తి, గుండ్లపల్లి గ్రామాల్లో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో పండిన యాసంగి వడ్లను కేంద్రం కొనబోమని మొండికేసినా సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకుని ధాన్యం సేకరిస్తున్నారని చెప్పారు. దీనిని రైతులు గమనించాలని, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందనే విషయాన్ని గమనించాలన్నారు.
కార్యక్రమాల్లో ఎంపీపీ రేణుకాదేవి, జడ్పీటీసీ గంట రాములు, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు కావటి రాజుయాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, విండో వైస్ చైర్పర్సన్ మద్దెల కమల, సీఈవో గోలి అంజిరెడ్డి, ఏవో నాగార్జున, సర్పంచులు సామ మణెమ్మ, పులుగు తిరుపతి రెడ్డి, పల్లె ఓదెలు, పిట్టల సరిత, కోట దామోదర్ రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా డైరెక్టర్లు ఆరెల్లి మొండయ్యగౌడ్, పిట్టల రవికుమార్, కందుల సదాశివ్, నాయకులు ఆకుల మహేందర్, కనికిరెడ్డి సతీశ్, గోపు నారాయణ రెడ్డి, పాకాల సంపత్‌రెడ్డి, బండారి ఐలయ్య, సాత్తూరి రవి, దొడ్డె శంకర్, బోయిని తిరుపతి, ఓదెల నరేందర్ పాల్గొన్నారు.