కార్పొరేషన్, ఏప్రిల్ 20 : కరీంనగర్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్లు కృషి చేయాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. బుధవారం నగర మేయర్ యాదగిరి వై సునీల్‌రావు అధ్యక్షతన నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్మార్ట్ సిటీ నిధులతో టెండర్లు పూర్తి చేసి ఎల్వో ఇచ్చిన కమాండ్ కంట్రోల్ ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టమ్, సీసీ సర్వైవ్‌లెన్స్ కెమెరాల ఏర్పాటు, నగరంలో నిరంతర నీటి సరఫరా, ఐలాండ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డంప్ యార్డు, ఈ-క్లాస్ రూం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేటెడ్ మారెట్లు తదితర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో చేపట్టిన పనులకు సంబంధించిన నిధులు వెనకి పోకుండా మార్చి 31లోగా డీపీఆర్ రూపొందించి, టెండర్లు పూర్తయ్యేలా చర్యలు చేపట్టిన నగర మేయర్ వై సునీల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్, నగరపాలక సంస్థ అధికారులు, ఆర్వీ ప్రతినిధులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టు పనులన్నింటినీ ప్రారంభించి… త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రత్యేకంగా ప్రాజెక్టు పనుల లైజెనింగ్ ఆఫీసర్‌గా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌ను పర్యవేక్షణ కోసం నియమిస్తున్నట్లు ప్రకటించారు. యూజీడీ పనుల్లో ప్రతి ఇంటికీ కనెక్షన్ ఉండేలా చూడాలన్నారు. నగరంలో హైజెనిక్ కండీషన్లో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ కలిగిన దాదాపు 600 పైగా కెమెరాలను అమర్చడంతో పాటు 150 చోట్ల వై ఫై కనెక్షన్ స్టాల్స్, 40 ఎల్ఈడీ స్రీన్లు ఏర్పాటు చేసి ప్రజల భద్రతను మరింత పెంచుతామన్నారు.
బయోమైనింగ్ డంప్ యార్డు పనులను సంవత్సరంలోగా పూర్తి చేసి తొమ్మిది ఎకరాల స్థలాన్ని క్లీయర్ చేయాలన్నారు. 24/7 వాటర్ సైప్లె పైలెట్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నగర వ్యాప్తంగా 24 గంటలు మంచినీరు అందేలా చర్యలు ప్రారంభించాలన్నారు. నగర పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. టవర్ సరిల్, మల్టీపర్పస్ పారుకు సంబంధించిన ఏజెన్సీ కాంట్రాక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని పనుల్లో వేగం పెంచాలన్నారు. నగరంలో నూతన పోల్స్ వేసిన చోట పాత వాటిని విద్యుత్ శాఖ అధికారులు తొలగించాలని ఆదేశించారు.
వచ్చే సంవత్సరం జనవరిలోగా నగరాన్ని సుందరంగా మార్చాలని సూచించారు. మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీలో పూర్తి చేసిన ప్రాజెక్టు పనుల ఏజెన్సీ కాంట్రాక్టర్లకు దాదాపు రూ.350 కోట్ల బిల్లులు కూడ చెల్లించామన్నారు. పనుల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటిని పరిషరించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, కమిషనర్ సేవా ఇస్లావత్, వివిద శాఖల అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.