కొత్తపల్లి, ఏప్రిల్ 19: హైదరాబాద్, ప్రైవేట్ సూల్స్ అండ్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పసవా) హైదరాబాద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన సెమ్స్ ఒలింపియాడ్ నేషనల్ టాలెంట్ టెస్ట్ ఫలితాల్లో కరీంనగర్‌లోని మానేరు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయి ర్యాంక్‌లను కైవసం చేసుకొన్నారు. దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాయగా మంగళవారం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌లో విడుదల చేశారు. 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలను రెండు స్థాయిల్లో నిర్వహించగా 10వ తరగతికి చెందిన రోజర్ ఏ రాజు మొత్తం 86 మారులు సాధించి ఆల్ ఇండియా నంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకొన్నాడు. అలాగే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జంగపల్లి జాహ్నవి 70 మారులు సాధించి 8వ తరగతి విభాగంలో రాష్ట్రస్థాయిలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి జాతీయస్థాయిలో నంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకొన్న రోజర్‌ను, 8వ తరగతి విభాగంలో స్టేట్ టాపర్‌గా నిలిచిన జాహ్నవిని అభినందించారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఒలింపియాడ్‌లో మానేరు విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయిలో నంబర్ వన్ స్థానంలో నిలువడం గర్వకారణమన్నారు. విద్యార్థులు కష్టపడి సాధన చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చన్నారు. మానేరు విద్యార్థులు విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, అందుకు నిదర్శనం సెమ్స్ ఒలింపియాడ్ ఫలితాలని గుర్తు చేశారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించి పాఠశాల, తల్లిదండ్రులతోపాటు జిల్లా, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఇలాంటి ఒలింపియాడ్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. గతంలో మానేరు విద్యాసంస్థల విద్యార్థులు ఆలిండియా స్థాయిలో అత్యుత్తమ మారులు సాధించి నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. ఉత్తమ, ఉన్నత విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా మానేరు విద్యాసంస్థలు నిలుస్తున్నాయన్నారు. విద్యార్థులను మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అభినందించారు.