జమ్మికుంట, ఏప్రిల్ 19: జమ్మికుంట బల్దియాపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించారని, మున్సిపల్ పరిధిలో పలు వార్డుల్లో రూ.43కోట్లతో అభివృద్ధి పనులు త్వరలో పూర్తి కానున్నాయని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.40 లక్షలతో పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్ ఏరియాలో చిల్డ్రన్స్ పార్కు, రూ.30లక్షలతో మున్సిపల్ కార్యాలయం సమీపంలో పార్కు నిర్మాణాలు ఇటీవల పూర్తి కాగా, మంగళవారం మున్సిపల్ చైర్మన్ చిల్డ్రన్స్ పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు, పార్కు నిర్మాణాన్ని పరిశీలించారు. తర్వాత చైర్మన్ మాట్లాడారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వం టీయూఎఫ్ఐడీసీ నిధులు కేటాయించిందని తెలిపారు.
ప్రజల సౌకర్యం కోసం నాలుగు పార్కులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి కాలనీలో డ్రైనేజీ, వీధి లైట్లు, సీసీ రోడ్లు వేయిస్తున్నామని, పనులన్నీ నాణ్యతా ప్రమాణాలతో సాగుతున్నాయని తెలిపారు. అందరి సహకారంతోనే పట్టణ అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు, డీఈ ప్రభాకర్, ఏఈలు చంద్రకళ, రాజేందర్, కౌన్సిలర్లు వీరన్న, భిక్షపతి, రాము, రాజయ్య, లావణ్య, రాజ్‌కుమార్, రమేశ్, శ్రీనివాస్, రాము, సదానందం, నాయకులు కిషన్‌రెడ్డి, వెంకటేశ్, రవీందర్, మల్లయ్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.