రామడుగు, ఏప్రిల్ 18: ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, వారి కోసం దేశంలోనే ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని గోపాల్రావుపేటలో 15 మందికి, గుండిలో ముగ్గురికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరు కాగా, సోమవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావుతో కలిసి లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యేను తోబుట్టువులా భావిస్తూ గుండిలో ఉత్కం పద్మ అనే మహిళ చక్కెర కుడుకలను పోసింది. ఆయా చోట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పాలనలో ఆడబిడ్డ పుట్టడం అదృష్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు.
ఆడబిడ్డ తల్లిదండ్రులకు భారం కాదని, ఇటు పుట్టింట్లో, అటు మెట్టినింట్లో ఆమెను లక్ష్మీదేవిలా భావించే రోజులు వచ్చాయన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా లక్షా నూటాపదహార్లు అందిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ ఒక్కటేనని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నేరుగా లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను అందిస్తున్నామన్నారు.సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, కొక్కెరకుంట విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంటల వెంకటరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, కొండగట్టు దేవాలయ బోర్డు డైరెక్టర్ వీర్ల సంజీవరావు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ ఎడవెల్లి కరుణశ్రీ, గుండి సర్పంచ్ మానస, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ రజబ్అలీ, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు వేల్పుల హరికృష్ణ, గుమ్మడి జలపతి, ఆర్పీఎస్ గ్రామ కోఆర్డినేటర్ సుద్దాల మల్లేశంగౌడ్, నాయకులు నేరెళ్ల అంజయ్యగౌడ్, కలిగేటి లక్ష్మణ్, దుర్శేటి మల్లేశం, శనిగరపు అర్జున్, కర్ర రాజిరెడ్డి, మామిడి తిరుపతి, పైండ్ల శ్రీనివాస్, పూడూరి మల్లేశం, కర్ర శ్యాంసుందర్‌రెడ్డి, ముదుగంటి రాజిరెడ్డి, ఎడవెల్లి పాపిరెడ్డి, ఏపూరి తిరుపతిగౌడ్, నాగుల రాజశేఖర్‌గౌడ్, తడగొండ నర్సింబాబు, హన్మంతు, పురాణం రమేశ్, తిరుపతి, లంక మల్లేశం, ఆరపెల్లి ప్రశాంత్, శనిగరపు అనిల్, ఎడవెల్లి మల్లేశం, బండారి చరణ్, బూత్కూరి సురేశ్, గుండి ప్రవీణ్, మేడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.