కార్పొరేషన్, ఏప్రిల్ 18: బధిరులకు అండగా ఉంటామని, పాఠశాలలో సకల సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ బధిరుల పాఠశాలలో ప్యూర్ సం స్థ రూ.1.50 లక్షల విలువైన వంట, క్రీడ సామగ్రితోపాటు బెంచీలను సమకూర్చగా, మంత్రి అం దజేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. విద్యార్థులకు ప్రతి మంగళవారం నాన్‌వెజ్ భోజనాన్ని తన సొంత ఖర్చులతో పెట్టేందుకు మంత్రి ముందుకువచ్చారు. అనంతరం మాట్లాడారు. బధిరుల పాఠశాలకు అవసరమైన సామగ్రిని ప్యూర్ సంస్థ సభ్యులు అందించడం అభినందనీయమని కొనియాడారు. ప్యూర్ స్వ చ్ఛంద సంస్థ ను స్ఫూర్తిగా తీసుకుని మరింతమం ది ముం దు కు వచ్చి బధిరులు, దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. విద్యార్థులకు ఇప్పటికే కాస్మటిక్ చార్జీలు విడుదల చేశామని తెలిపారు. బధిరుల జూనియర్ కళాశాలపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడ మేయర్ వై సునీల్‌రావు, కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ నాయకు లు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, కర్ర సూర్యశేఖర్, సంస్థ ప్రతినిధులు ఉన్నారు.