వనదేవతలు సమ్మక, సారలమ్మ జాతరకు భక్తజనం పోటెత్తింది. డివిజన్లోని పలు చోట్ల జాతర ప్రాంగణాలు ఎటుచూసినా జనసంద్రంగా మారాయి. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఎత్తు బంగారం సమర్పించి, మొకులు చెల్లించుకున్నారు. గద్దెల దగ్గర భక్తులు బారులు తీరగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర కమిటీల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.
వనదేవతలను దర్శించుకున్న గెల్లు, బండ
హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని రంగనాయకులగుట్ట వద్ద కొలువుదీరిన సమ్మక, సారలమ్మను టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్-సువర్ణ దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు గందె రాధిక-శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ నిర్మల, పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సంగెం ఐలయ్య కుటుంబ సభ్యులతో కలిసి తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అపరాజ ముత్యంరాజు, గోసుల రాజు, జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ సురకంటి సదాశివరెడ్డి, వైస్ చైర్మన్ గొసుల వెంకన్న, డైరెక్టర్లు వీ గోపాల్‌రావు, పంజాల హరీశ్‌గౌడ్, గాలి రాకేశ్నేత, మోరే మధు, మధూకర్‌రెడ్డి, బండారి లవన్, ప్రతాప్ రవి, గట్టు గణేశ్, కందుల స్వామిపటేల్, జీవన్, నాగరాజ్, రాజు, మొగిలి, టేకుల శ్రావణ్, వీరన్న, టీఆర్ఎస్ నాయకులు కన్నెబోయిన శ్రీనివాస్, మనోహర్, సంపంగి మైకెల్, ఉమాపతిరావు పాల్గొన్నారు.
జూపాకలో..
మండలంలోని జూపాక గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క, సారలమ్మ జాతరకు పలు గ్రామాల నుంచి భక్తులు పోటెత్తారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పార్టీ యువ నాయకుడు వొడితల ప్రణవ్‌బాబు వనదేవతలను దర్శించుకున్నారు. జాతర కమిటీ చైర్మన్ కేతిరి రాజిరెడ్డి నాయకులను శాలువాలతో సత్కరించారు.
జమ్మికుంటలో..
మున్సిపల్ పరిధిలోని కేశవాపూర్ సమ్మక్క-సారలమ్మ జాతర.. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పాతకాల అనిల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సాగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో సిబ్బంది విధులు నిర్వహించారు. కాగా, సాయంత్రం సమ్మక్క-సారలమ్మను టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మమత, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
వాగొడ్డురామన్నపల్లిలో..
వాగొడ్డురామన్నపల్లిలో గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఇక్కడ సర్పంచ్ పుట్ట రాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఉడుత వీరాస్వామి, జాతర కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.
ఊరగుట్ట వద్ద..
మండలకేంద్రంలోని ఊరగుట్ట వద్ద కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను మండలంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. జాతర కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
మినీ మేడారం.. భక్తజన సంద్రం
మినీ మేడారంగా పేరొందిన వీణవంక జాతర అత్యంత వైభవంగా జరిగింది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మను లక్ష మందికి పైగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఊరేగింపుగా జాతర ప్రాంగణానికి చేరుకున్నారు. నెత్తిన ఎత్తు బంగారంతో కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దంపతులు సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. వీణవంకకు చెందిన యప్‌టీవీ సీఈవో పాడి ఉదయ్‌నందన్‌రెడ్డి, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్‌రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కాసం వీరారెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత, ఆయా గ్రామాల ఉత్సవ కమిటీల చైర్మన్లు పాడి రామకృష్ణారెడ్డి, జక్కు నారాయణ, మర్రి స్వామి, రాజయ్య, పరిపాటి గోపాల్‌రెడ్డి, సర్పంచులు నీల కుమారస్వామి, పొదిల జ్యోతి- రమేశ్, పింగిళి కోమల్‌రెడ్డి, మర్రి వరలక్ష్మి, ఎంపీటీసీలు సంజీవరెడ్డి, ఎలవేన సవిత-మల్లయ్య, సొసైటీ డైరెక్టర్లు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కిషన్‌రెడ్డి, పుల్లారెడ్డి, సత్యనారాయణ, రాజయ్య, భానుచందర్, దేవయ్య, ఆయా జాతర్లలో అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు.
జమ్మికుంట మండలంలో..
మండలంలోని తనుగుల, వావిలాల గ్రామాల్లో గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మను టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఆయనకు జాతర కమిటీల సభ్యులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, ఎంపీపీ దొడ్డె మమత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్‌కుమార్, వైస్ ఎంపీపీ తిరుపతిరావు, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కనపర్తి లింగారావు, తనుగుల జాతర కమిటీ అధ్యక్షుడు గట్టు రాంచంద్రంగౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్పంచులు చిలుముల వసంతారామస్వామి, బల్గూరి పద్మాసమ్మారావు, జక్కన శ్రీలతాసత్యం, ఎంపీటీసీలు తోట కవితాలక్ష్మణ్, నిరోషారామస్వామి, మర్రి మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ పొల్సాని వెంకటేశ్వర్రావు, కో ఆప్షన్ సభ్యుడు రఫీ, తనుగు జాతర కమిటీ ఉపాధ్యక్షుడు ఓరుగంటి హేమచందర్‌రావు, సభ్యులు బత్తుల పాండు, రాజేశ్వర్‌రావు, దేవేందర్‌రెడ్డి, తిరుపతి, సంపత్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, కిషన్‌రెడ్డి, నర్సయ్యగౌడ్, కొమురయ్య, ప్రతాప్, నందం, లింగారావు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రాచపల్లి సదానందం, వావిలాల యూత్ నాయకుడు సతీశ్ తదితరులున్నారు.