శంకరపట్నం, ఫిబ్రవరి 18: కేశవపట్నంలో వన దేవతలు సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం గద్దెల ప్రాంగణం భక్తుల తాకిడితో కిక్కిరిసింది. స్థానిక పూజారులు గొడిశాల ఎల్లయ్య, జనగాం తిరుపతి, కొత్తపెల్లి రాజయ్య గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు, జాతర కమిటీ సభ్యులు సమన్వయంతో వ్యవహరించి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలతో నిఘా వేశారు. పలువురు భక్తులు వన దేవతలకు ఎత్తు బంగారం, ఎదుర్కోళ్లు సమర్పించారు. కేశఖండనం వద్ద భక్తుల రద్దీ కనిపించింది. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర కమిటీ చైర్మన్ గుర్రం స్వామి, ఈవో శ్రీనివాస్, జాతర కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వనదేవతలకు మొక్కులు చెల్లించిన ‘పొలాడి’
మానకొండూర్, ఫిబ్రవరి 18: ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, రైతు నేత పొలాడి రామారావు శుక్రవారం మండలంలోని కొండపల్కల, లింగాపూర్, దేవంపల్లి, వేగురుపల్లి గ్రామాల్లో సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు ఆయన సూచించారు.
మానకొండూర్ మండలంలో..
మానకొండూర్ మండలం లింగాపూర్‌లో పొల్సాని దేవేందర్ రావు వ్యవసాయ క్షేత్రంలో, దేవంపల్లి ఆలయ కమిటీ అధ్యక్షుడు రేణికుంట శంకర్ ఆధ్వర్యంలో, కొండపల్కల గ్రామంలో జాతర కమిటీ అధ్యక్షుడు రంగు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో సమ్మక్క, సారలమ్మ జాతర ఘనంగా జరిగింది. శుక్రవారం ఆయా చోట్ల వనదేవతలను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు జీవీఆర్‌కు ఆయా జాతర కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. కొండపల్కలలో రేణుకా దేవాలయంలో అమ్మవారిని దర్శించుకోగా గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ తిరుపతి గౌడ్ సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శేఖర్ గౌడ్, సర్పంచులు నల్ల వంశీధర్ రెడ్డి, పొల్సాని మురళీధర్ రావు, మర్రి కొండయ్య, ఉప సర్పంచులు తోట రాజమౌళి, బండారిపల్లి శ్రీనివాస్,నెల్లి మురళి, ఆర్బీఎస్ కన్వీనర్ కడారి ప్రభాకర్, యూత్ మండలాధ్యక్షుడు అడప శ్రీనివాస్, నాయకులు రెడ్డి సంపత్ రెడ్డి, ఇడుమాల సంపత్, జీడి సదయ్య, దూలం వీరస్వామి, గుర్రం కిరణ్ గౌడ్, నెల్లి శంకర్, బొల్లం శ్రీనివాస్, మల్యాల మొగిలి, గోపగోని నవీన్, రాములు, బోయిని వెంకటేశ్, బూమరాజు శ్రీనివాస్, పొలవేని సంపత్, కలవేని రవి, గణపతి రెడ్డి, పెద్దపల్లి బ్రహ్మం, గోస్కుల శ్రీనివాస్, గోస్కుల స్వామి, కనుకుంట్ల మహేందర్, రేణికుంట సంపత్, రేణికుంట సాగర్, ఆయా గ్రామాల కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ మండలంలో..
మండలంలోని కొత్తపల్లి, నల్లగొండ, రామకృష్ణకాలనీ, వచ్చునూర్ గ్రామాల్లో గద్దెలపై కొలువుదీరిన వనదేవతలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర కమిటీల సమన్వయంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే రామకృష్ణకాలనీలో అమ్మవార్లను అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క, సారలమ్మ విశిష్టతను నిర్వాహకులు వివరించారు.
జాతరకు తరలిన భక్తులు
సమ్మక, సారలమ్మ జాతరను పురసరించుకొని మండలంలోని అన్ని గ్రామాల భక్తులు మొకులు తీర్చుకునేందుకు శుక్రవారం భారీగా తరలి వెళ్లారు. హుజూరాబాద్, కేశవపట్నం, కొత్తపెల్లి జాతరకు వాహనాల్లో బయలు దేరారు. రేకొండ సర్పంచ్ పిట్టల రజిత, గౌరీశంకర ఆలయ చైర్మన్ పిట్టల అంబయ్య గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కొత్తగట్టు జాతరలో మొకులు తీర్చుకున్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, హుస్నాబాద్ మారెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ కొమ్మెర మంజుల, సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు అందే సుజాత, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.