కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 18 : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను ఐటీ విషయంలో ఇబ్బంది పెట్టబోమని, నిబంధనల ప్రకారమే వేతన బిల్లులను ఆడిట్ చేస్తామని జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు స్పష్టం చేశారు. ఈ నెల వేతన బిల్లులతోపాటే ఐటీ ఫామ్స్ ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో ఐటీ సంబంధిత అంశాలపై టీఆర్టీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మానేటి ప్రతాపరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చిట్నేని శ్రీకాంత్‌రావు, వేముల మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శుక్రవారం డీటీవోతో చర్చించారు. ఐటీ నిబంధనల మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు మినహాయింపులను వర్తింపజేస్తామని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని డీటీవో స్పష్టం చేశారు. ఐటీ డిడక్షన్, రిమిటెన్సు, ఫైలింగ్‌లో పూర్తి బాధ్యత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ (డీడీవో)దేనని, ఐటీ రూల్స్ ప్రకారమే డీడీవోలు వ్యహరించాలని డీటీవో కోరారు. జిల్లా ట్రెజరీ పరిధిలోని అన్ని సబ్-ట్రెజరీ కార్యాలయాలకు ఈ విషయంలో ఆదేశాలు జారీచేస్తానని చెప్పారు. ఈ – కుబేర్ లో పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఐటీ మినహాయించకూడదని ఉద్యోగ, ఉపాధ్యాయుల బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అయిన మొత్తాలకు మాత్రమే ఐటీ లెకగట్టాలని చెప్పారు. మార్చి 31 లోగా ఈ కుబేర్ లో బిల్స్ పాసయితే ఐటీ చలానుల ద్వారా చెల్లించాలని పేరొన్నారు. ఇటువంటి బిల్లుల పూర్తి బాధ్యత, ఐటీ చెల్లింపులు డీడీవో తీసుకోవాలని వారు కోరారు. హెచ్ఆర్ఏ విషయంలో ఇంటి యజమాని పాన్ నంబర్, అద్దె చెల్లింపు రసీదు తప్పనిసరి అని పేరొన్నారు. ఇక్కడ ఏటీవో సీహెచ్ రాజన్న, ఎస్టీవో ఎన్ దేవేందర్, ఉమాదేవి, అహమ్మద్‌ఖాన్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కూర రమేశ్, జిల్లా అధ్యక్షుడు సుంకిశీల ప్రభాకర్‌రావు, రాష్ట్ర బాధ్యుడు రాజేశ్ పాల్గొన్నారు.