రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను గురువారం హుజూరాబాద్ నియోజక వర్గంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. మొక్కలు నాటి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ జీవించాలని ఆ దేవున్ని కోరుకున్నారు. మండల కేంద్రాల్లో కేక్‌లను కట్‌చేసి పంచి పెట్టారు. అన్నదానం చేశారు. బైక్ ర్యాలీలు నిర్వహించారు.
హుజురాబాద్, ఫిబ్రవరి 17 : హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మున్సిపల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల కేక్ కట్ చేసి కమిషనర్ చీమ వెంకన్నకు తినిపించారు. అనంతరం మున్సిపల్ ఆవరణలో మొకలు నాటారు. హరిత తెలంగాణే ధ్యేయంగా పాటుపడుతున్న అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని, ఆయన నిండు నూరేళ్లు జీవించాలని వారు అభిలషించారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు కల్లేపల్లి రమాదేవి, తోట రాజేంద్రప్రసాద్, గనీశెట్టి ఉమామహేశ్వర్, మాకపెల్లి కుమార్‌యాదవ్, ప్రతాప తిరుమల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గందె శ్రీనివాస్, పోరెడ్డి శాంతన్రెడ్డి, బీఎస్ ఇమ్రాన్, ఎం పూర్ణచందర్, ప్రతాప కృష్ణ, కొండ్ర నరేశ్, బీ కుమార్‌యాదవ్, భాసర్కురుమ నాయకులు ఉన్నారు.
సీఎం జన్మదిన వేడుకలు హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించారు. అతిథిగా విచ్చేసి న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ భారీ కేక్‌ను కట్ చేసి జీవీఆర్‌కు తినిపించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడిని శాలువాలతో సత్కరించారు. జీవీఆర్ మాట్లాడుతూ, దేశాన్ని పరిపాలించే శక్తి సీఎం కేసీఆర్‌కు ఆ భగవంతుడు ఇవ్వాలని, అందుకు ఆయనకు ఆయురారోగ్యాలు ప్ర సాదించాలని, కోరుకుంటున్నామన్నారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ విజయాగణపతి, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ నిర్మల, మారెట్ కమిటీ చైర్పర్సన్ బర్మావత్ రమాయాదగిరినాయక్, మాజీ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్, జాతరకమిటీ చైర్మన్ సదానందరెడ్డి, యూ త్ రాష్ట్ర నాయకుడు ప్రణవ్‌బాబు, టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్వై, నాయకులు ఉన్నారు.
చల్లూరులోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో నాయకులు ప్రత్యేక పూజలు చేసి, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేసీఆర్ జన్మదిన కేక్‌కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు, ఎంపీపీ రేణుకాతిరుపతిరెడ్డి, జడ్పీటీసీ వనమాలాసాదవరెడ్డి, సర్పంచ్ జ్యోతీరమేశ్, ఎంపీటీసీ సవితామల్లయ్య, ఉపసర్పంచ్లు సంపత్ రెడ్డి, దేవయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు నారాయణ, రాజయ్యగౌడ్, గోవిందరెడ్డి, సదానందం, మొగిలి, సురేందర్‌రెడ్డి, రవి, వార్డుసభ్యులు నగేశ్, శ్రీనివాస్, జీవన్కుసుమకుమార్, రవి, రమేశ్, కోఆప్షన్ మునీరొద్దీన్, బీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలి
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ చురుకైన పాత్ర పోషించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు కోరారు. గురువారం మండల కేంద్రానికి జిల్లా అధ్యక్షుడు, జీవీ, నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ రాగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. ఇల్లందకుంట రామాలయంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దేవాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడులను జరుపగా జీవీ, గెల్లు కేక్ కట్‌చేసి స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ విజయాగణపతి, ఎంపీపీ పావణీవెంకటేశ్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, మార్కెట్ చైర్మన్ బాలకిషన్‌రావు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ రాజ్‌కుమార్, డీసీసీబీ జిల్లా వైస్‌చైర్మన్ రమేశ్, పీఎసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్లు కొంరెల్లి, వీరాస్వామి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు ప్రణయ్, సాధవరెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీరాం, రాజిరెడ్డి, మహేందర్, వాసుదేవరెడ్డి ఉన్నారు.
మండల కేంద్రంలో జడ్పీవైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజయ్య కేసీఆర్ జన్మదిన కేక్ కట్ చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు తిరుపతిరెడ్డి, వెంకటరెడ్డి, సర్పంచ్‌లఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు రాములు, గణేశ్, రాజిరెడ్డి, సుశీలాతిరుపతిగౌడ్, అక్షయా శ్రీనివాస్‌నాయక్, కొంరయ్య, పాపయ్య, పద్మజాకొంరయ్య, కాంతమ్మ, సుమలతఅశోక్, శిరీషాముకుందరెడ్డి, లతాకుమారస్వామి, ఐలయ్య, ఎంపీటీసీ అనితారవీందర్రెడ్డి, దిశ కమిటీ సభ్యు లు శ్రీనివాస్‌నాయక్, నాయకులు వీరారెడ్డి, రవీందర్, రవీందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజిరెడ్డి, వీరేశం, శంకర్‌నాయక్, ప్రవీణ్, విద్యాన్రెడ్డి, స్వా మి, రవీందర్, అయిలయ్య, జీ శ్రీనివాస్, ప్రభాకర్, ఎం శ్రీనివాస్, ఆంజనేయులు ఉన్నారు.
మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ, జడ్పీ అధ్యక్షురాలు విజయ, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్, భారీ సంఖ్యలో నాయకులు హాజరయ్యారు. తెలంగాణ చౌక్ వద్ద కేక్ కట్ చేసి, కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ అధ్యక్షురాలిని కౌన్సిలర్లు, నాయకులు గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేసీఆర్ పోరాటాల ఫలితమే స్వరాష్ట్రమని, సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని కొనియాడారు. సీఎంగా కేసీఆర్ రాష్ర్టాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతున్నారన్నారు. కేసీఆర్ మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని, జాతీయ రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అంతకుముందు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అయ్యప్ప దేవాలయం నుంచి బైక్ ర్యాలీ తీశారు. ఎంపీపీ మమత, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, డీసీసీబీ వైస్‌చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మండలంలోని తనుగులలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి అధ్వర్యంలో నిర్వహించారు. సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసి కేసీఆర్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. అనంతరం గండ్రపల్లిలో సీఎం జన్మదిన కేక్ కట్‌చేసి స్వీట్లను పంచారు. ఇక్కడ సర్పంచులు వసంతారామస్వామి, పద్మాసమ్మారావు, ఎంపీటీసీలు కవితాలక్ష్మణ్, నిరోషారామస్వామి, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్రావు, జాతర కమిటీ అధ్యక్షుడు రాంచంద్రంగౌడ్, ఉపాధ్యక్షుడు హేమచందర్‌రావు, శంభునిపల్లి, గండ్రపల్లి టీఆర్ఎస్ అధ్యక్షుడు సదానందం, సురేశ్, టీఆర్ఎస్ నాయకుడు మాధవరావు, జాతర కమిటీ సభ్యులు పాండు, రాజేశ్వర్‌రావు, దేవేందర్‌రెడ్డి, తిరుపతి, సంపత్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, కిషన్‌రెడ్డి, నర్సయ్యగౌడ్, కొమురయ్య, ప్రతాప్, నందం,లింగారావు ఉన్నారు.
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మున్సిప ల్ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాథాశ్రమంలో నిర్వహించారు. కేక్ కట్‌చేసి విద్యార్థులకు పంపిణీ చేసి, అన్నదానం చేశారు. ఇక్కడ నాయకులు అన్నం ప్రవీణ్, మధు, రాజేందర్, ప్రవీణ్, కుమార్, సు నీల్, దీపక్, శ్రీకాంత్, తదితరులున్నారు.
తెలంగాణ సాంసృతిక సారథి కళాకారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. ఇక్కడ తెలంగాణ సాం సృతిక సారథి కళాకారులు అనీల్‌కుమార్, వెంకన్న, కోమల, రాజు, శ్రీధర్, తిరుపతి, సురేశ్, శ్రావణ్‌కుమార్, విజేందర్, సంపత్, సాయికుమార్, తిరుపతి పాల్గొన్నారు. అలాగే హుజూరాబాద్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి చేశారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్‌కుమార్, ఉపాధ్యక్షుడు సతీశ్, చైర్మన్ అహ్మద్ పాషా, వరింగ్ ప్రెసిడెంట్ కిరణ్, ప్రధాన కార్యదర్శి భాసర్, రాజన్న, రమేశ్, వెంకన్న, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.