కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 13 : సింగరేణి సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అతి చేరువలో ఉంది. ఈ ఆర్థి క సంవత్సరంలో జనవరి 30 వరకు సంస్థ వ్యాప్తంగా 92 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిం ది. నాలుగు ఏరియాలు ఇల్లెందు, ఆర్జీ-3, మ ణుగూరు, ఆర్జీ-2 ఏరియాలు వందశాతం ఉత్పత్తిని సాధించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 14.1 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అధికంగా సాధించింది. మిగిలిన ఫిబ్రవరి, మార్చిలో సంస్థ నిర్దేశించిన 680 మిలియన్ టన్నులు లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు సాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను పరిశీలిస్తే..
ఇల్లెందు ఏరియాలో 44,60,920 టన్నులకు గానూ 51,16,977 టన్నుల ఉత్పత్తి సాధించింది. ఇది మొత్తం 115 శాతం. ఆర్జీ-3 ఏరియాలో 48,69,375 టన్నులకు గానూ 53,97,986 టన్నులతో 111 శాతం బొగ్గు ఉత్పత్తి చేసింది. మణుగూరు ఏరియాలో 91,39,958 టన్నులకు గానూ 1,00,57, 127 టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి 110 శాతం గా నిలిచింది. ఆర్జీ-2 ఏరియాలో 64,75, 062 టన్నులకు గానూ 70,93,520 టన్ను లు బొగ్గు ఉత్పత్తి చేసి 110 శాతం సాధించింది. శ్రీరాంపూర్ ఏరియాలో 53,85,521 టన్నులకు గానూ 50,01,888 టన్నులు ఉత్పత్తి చేసి 93 శాతంగా నిలిచింది. కొత్తగూడెం ఏరియాలో 1,12,33,938 టన్నులకు గానూ 1,03,85,567 టన్నులు బొగ్గు వెలికితీసి 92 శాతం వృద్ధి సాధించింది. మందమర్రి ఏరియాలో 41,36,658 టన్నులకు గానూ 35,71,855 టన్నులతో 86 శాతం, బెల్లంపల్లి ఏరియాలో 27,11,458 టన్నులకు గానూ 17,37,077 టన్నులతో 64 శాతం సాధించింది. ఆర్జీ-1 ఏరియాలో 26,28,280 టన్నులకు గానూ 14,07,435 టన్నులతో 54 శాతం, భూపాలపల్లి ఏరియాలో 35,06,855 టన్నులకు గానూ 17,52,888 టన్నులతో 50 శాతం సాధించింది. అడ్రియాలలో 18,00, 271 టన్నులకు గానూ 8,02, 868 టన్నులు ఉత్పత్తి చేసి 45 శాతం వృద్ధి సాధించింది. మొత్తంగా 5,67, 35,816 టన్నులకు గానూ 5,23,25,218 టన్నులతో 92 శాతం బొగ్గు ఉత్పత్తి చేసింది. ఇదే ఒరవడితో సమష్టి కృషి చేసి లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాలన్నీ ముందుకు పోతున్నాయి.