కమాన్‌చౌరస్తా, నవంబర్ 29: నగరంలోని పలు ఆలయాల్లో మంగళవారం సుబ్రహ్మణ్య షష్ఠి పూజలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి, అనంతనాగేంద్ర స్వామి, కార్తీకేయ విగ్రహాలకు విశేష అభిషేకాలు, అలంకారం, అర్చనలు చేశారు. భగత్‌నగర్‌లోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, డింగరి చాణక్య వైదిక నిర్వహణలో అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ ఆలయ ఈవో కాంతారెడ్డి, రవీందర్, లింగంపల్లి సత్యనారాయణ, బొల్లు నరేందర్, పల్లె నారాయణ తదితరులు పాల్గొన్నారు.
పాతబజార్‌లోని గౌరీశంకరాలయంలో పురాణం మహేశ్వరశర్మ, పురాణం శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో ఆలయ వ్యవస్థాపక వంశీయ చైర్మన్ పొద్దుటూరి శ్రీనివాస్, ఈవో ఉడుతల వెంకన్న, మహాదేవసేవ పరివారం సభ్యులు కార్తీక్, శ్రవణ్, రాజు, సాయి పాల్గొన్నారు. భగత్‌నగర్‌లోని అంజనాద్రి గుట్టపై ఉన్న అనంతనాగేంద్రస్వామి సన్నిధిలో జరిగిన పూజల్లో చిలకపాటి హనుమంతరావు పాల్గొన్నారు. అశోక్‌నగర్‌లోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఫణిశర్మ ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో అధ్యక్ష, కార్యదర్శులు చిట్టుమల్ల శ్రీనివాస్, కారం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకట హర చతుర్థి కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు. రాంపూర్‌లోని గిద్దెపెరుమాండ్ల ఆలయంలో పురాణం మహేశ్వరశర్మ, రామక శంకరశర్మ ఆధ్వర్యంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. సేవకుడు కలర్ సత్తన్న, భక్తులు పాల్గొన్నారు. కమాన్‌రోడ్డులోని రామేశ్వరాలయంలో చౌడుబట్ల రఘురామశర్మ వైదిక నిర్వహణలో స్వామి వారికి 100 లీటర్ల పాలతో అభిషేకం చేశారు. అనంతరం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
కరీంనగర్ రూరల్: నవంబర్ 29: గోపాల్‌పూర్‌లోని తాపాల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి వేద పండితుడు మధుసూదనా చార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతనం ఆలయ ఆవరణలో గ్రామానికి చెందిన దాడి రవి ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్షాపరులకు బిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాడి రాము, సర్పంచ్ ఊరడి మంజుల, మాజీ ఎంపీటీసీ దాడి సుధాకర్, వార్డు సభ్యులు, సాయిని తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. నగునూర్‌లోని దుర్గాభవానీ ఆలయంలో శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కల్యాణాన్ని వేదపండితుడు పురాణం మహేశ్వర శర్మ కనుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పవనకృష్ణ శర్మ, ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ బాధ్యులు, భక్తులు పాల్గొన్నారు.
రామడుగు, నవంబర్ 29: గోపాల్రావుపేట అయ్యప్ప ఆలయం, రాజరాజేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని భక్తులు ఘనంగా జరుపుకొన్నారు. అయ్యప్ప ఆలయ ఆవరణలోని సుబ్రహ్మణ్య ఉపాలయంలో ఉదయపూర్వం స్వామి వారి మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. స్థానిక రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకించారు. ఈ కార్యక్రమాల్లో అర్చకులు డింగిరి వెంకటరమణా చార్యులు, దుర్శేటి రవికిరణాచార్యులు, అయ్యప్ప స్వాములు పంతగాని రమేశ్, ముప్ప మహేశ్, బుర్ర కృష్ణమూర్తి, కాసారపు పరశురాములు, పీచు విజయ్, ఏపూరి వెంకటేశ్, చంద్రశేఖర్‌రెడ్డి, పైండ్ల శ్రీనివాస్, పొన్నం రవీందర్, గుర్రం శ్రీనివాస్, గాజుల రాజశేఖర్, బుదారపు కార్తీక్, పొన్నం పవన్, ఇనుగుర్తి రఘువీర్, కొలిపాక తిరుపతి, ముంజ రాకేశ్, గాజరవేణి మహేశ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.