వేములవాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో గోడలపై సందేశాత్మక చిత్రాలు వేయిస్తున్నారు. రాజన్న గుడి చెరువు బండ్, ప్రభుత్వ కార్యాలయాలు, పాత గోడలు తదితర వాటిపై 18లక్షలతో పలు అంశాలపై ప్రజలను చైతన్య పరిచే చిత్రాలను వేయిస్తున్నారు.
కార్యాలయాలకు అనుగుణంగా చిత్రాలను వేయడమే కాకుండా ప్రజలకు సులువుగా అర్థమయ్యే రీతిలో గీసిన చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తే చట్టం తీసుకునే చర్యలు, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణం నేరమని.. ఇలా ప్రజలకు అవగాహన కల్పించే చిత్రాలను పోలీస్ స్టేషన్ కార్యాలయం గోడలపై వేశారు. వాటితో పాటు పచ్చదనం, పరిశుభ్రత తదితర అంశాలతో కూడిన చిత్రాలు కూడా ఆకుట్టుకుంటున్నాయి.
– వేములవాడ, నవంబర్ 17