ఫర్టిలైజర్‌సిటీ, అక్టోబర్ 10 : రామగుండం పోలీసు కమిషనరేట్‌లో రూ.3.6 కోట్లతో నిర్మించిన గోదావరిఖని మోడల్ వన్‌టౌన్ పోలీస్టేషన్ భవనాల ప్రారంభోత్సవానికి మంగళవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి రానున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వస్తారు. ముందుగా పోలీసు భవనం, తర్వాత రూ.1.5 కోట్లతో నిర్మించిన పోలీసు విశ్రాంతి భవనం, రూ.1.5 కోట్లతో నిర్మించిన అంతర్గాం పోలీసు స్టేషన్ భవనాన్ని ప్రారంభిస్తారు. వీరితో పాటు రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎంపీ వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సీపీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు. ఈ మేరకు గోదావరిఖని ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.