కోరుట్ల, సెప్టెంబర్ 4: ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి టీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణం అర్ఫత్పురాలోని బైతూల్ మాల్ వెల్ఫేర్ సొసైటీ భవన నిర్మాణ పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. బైతుల్ మాల్ సొసైటీ సమకూర్చిన 650 మందికి రూ. 200 చొప్పున పింఛన్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు పింఛన్లు అందిస్తున్న బైతూల్ మాల్ సొసై టీ బాధ్యులు అభినందనీయులన్నారు. సొసైటీ భవన నిర్మాణానికి సొంత నిధుల నుంచి రూ.15 లక్షలు వెచ్చిస్తానని ప్రకటించారు. తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ వినూత్న పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే 29 రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రంజాన్ పండుగను అధికారికం గా నిర్వహిస్తూ పేద ముస్లింలకు బట్టలు, విందు భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు.
మసీదుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇస్తున్న ఘనత ఆయనకే దక్కిందని చెప్పారు. మైనార్టీ ఆడబిడ్డల పెండ్లిళ్లకు షాదీముబారక్ పథకం కింద రూ.లక్ష అందజేస్తున్నారని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా జీవనం సాగిస్తున్న తెలంగాణలో కొంద రు కుట్రదారులు చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బైతూల్ మాల్ సొసైటీ అధ్యక్షుడు మౌలానా మజార్ ఖాస్మీ, ప్రతినిధులు ముల్లా మసూద్, నజీబొద్దీన్, ఖయ్యూం, సాజిద్, మజిద్, యూసూఫ్ అలీ, షాబీర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, జిల్లా సర్పంచ్ల ఫోరం గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, మున్సిపల్ కమిషనర్ అయాజ్, నాయకులు ఫహీమ్, సాబీర్ అలీ, రఫీ, రహీమ్, సజ్జు, జిందం లక్ష్మీనారాయణ, పేర్ల సత్యం, సనావొద్దీన్, వాసిక్ ఉర్ రహ్మన్ పాల్గొన్నారు.