సాగులో సాంకేతికతవైపు రైతులు అడుగులు వేస్తున్నారు. మూస పద్ధతులకు స్వస్తి పలుకుతూ.. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన రైతులు డ్రోన్‌తో గడ్డి మందు పిచికారీ చేయించారు. నాలుగెకరాల్లో కేవలం 40 నిమిషాల్లోనే పూర్తి చేశారు.
– ఓదెల, ఆగస్టు 2
ఓదెల, ఆగస్టు 2: మారుతున్న కాలంతోపాటే రైతులూ మారుతున్నారు. సాగులో ఆధునిక సాం కేతికతను అందిపుచ్చుకుంటున్నారు. ఓదెల మం డలం కొలనూర్‌కు చెందిన రైతులు కర్ర రాజేందర్‌రెడ్డి, కొల్లూరి రాజమల్లు డ్రోన్ సహాయంతో పొలంలో రసాయన మందులు పిచికారీ చేయించారు. కరీంనగర్‌లోని గరుడ ఎరోస్పేస్ ఎక్సెల్ ఆటోస్‌లో బీఎంగా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన కర్ర సతీశ్‌రెడ్డి, ఈ డ్రోన్ గురించి వివరించడంతో రైతులు ముందుకొచ్చారు.
మంగళవా రం డ్రోన్ సాయంతో తమ నాలుగెకరాల పొలం లో గడ్డి మందు స్ప్రే చేయించారు. గరుడ ఎరోస్పేస్ ఎండీ ప్రదీప్‌కుమార్ పర్యవేక్షణలో ఎకరం పొలానికి పది నిమిషాల చొప్పున 40 నిమిషాల్లో నాలుగెకరాల పిచికారీ చేశారు. ఈ పద్ధతి మంచిగ ఉందని, ఎకరాకు 600 వరకు తీసుకున్నారని రైతులు తెలిపారు. అదే కూలీల ద్వారా అయితే ఎకరం పొలంలో స్ప్రే చేయించాలంటే ముగ్గురు కూలీలు అవసరమని, గంట సమయం పడుతుందన్నారు. డ్రోన్‌తో అయితే మందు క్రమపద్ధతిలో పడుతుందని, వృథాను అరికట్టవచ్చని చెప్పారు.