కలెక్టరేట్, ఆగస్టు 1: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై కలెక్టరేట్‌కు వచ్చిన 250 మంది బాధితులు కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు సమస్యలు తెలిపి దరఖాస్తులు అందించారు. దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని సూచించారు. ఇప్పటివరకు ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించిన సమస్యలు తదితర వివరాలను వెంటనే పోర్టల్‌లో పొందుపర్చాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్‌లాల్, డీఆర్డీవో శ్రీలత, ఆర్డీవో ఆనంద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డీఎంహెచ్‌వో జువేరియా, డీఈవో జనార్దన్‌రావు, డీఏవో శ్రీధర్, మత్య్సశాఖ అధికారి దేవేందర్, జిల్లా పరిశ్రమల అధికారి రాజమనోహర్‌రావు, జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నతానియేలు, మైనార్టీ సంక్షేమాధికారి మధుసూదన్, మెప్మా పీడీ రవీందర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీఎస్డీవో రాజవీరు, డిప్యూటీ తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.