జూలపల్లి, ఆగస్టు 1: తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను కాంగ్రెస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయ ని, వాటికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జూలపల్లి మండలం అబ్బాపూర్‌లో సోమవారం 57 మంది (కుర్మలు) లబ్ధిదారులకు చెందిన గొర్రెలు, మేకల మేత కో సం భూమి పట్టాలు అందజేశారు. ఈసందర్భం గా మంత్రి మాట్లాడుతూ, 40 ఏండ్ల కాంగ్రెస్ పా లనలో ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించా రు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలుచేస్తూ ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నదని, గ్యాస్, చమురు ధరలు పెంచడంతో పేదల బతుకులు భారంగా మారుతున్నాయని పే ర్కొన్నారు. పాలపై 5శాతం జీఎస్టీ పన్ను వేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రంలో 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఏటా పదివేల కోట్లు ఖర్చుచేసి ఉచి త విద్యుత్ అందిస్తున్నారని వివరించారు. రైతు కుటుంబాల సంక్షేమం కోసం 1500 కోట్ల ప్రీ మియం చెల్లించి బీమా సౌకర్యం కల్పిస్తున్నారని గుర్తుచేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో తెలంగాణ దేశంలో ముందు వరుసలో ఉందని స్పష్టం చేశారు. యువత అడ్రస్ లేని పార్టీల మాయ మాటలకు మోసపోవద్దని పేర్కొన్నారు.
పాఠశాలలో పరిశుభ్రతపై దృష్టి పెట్టండి
పాఠశాలలో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ప్రిన్సిపాల్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. సోమవారం ఆయన నందిమేడారం గురుకుల స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు విద్యార్థులు జ్వరాల బారిన పడినట్టు స్థానిక నేతల ద్వారా తెలుసుకొని స్కూల్‌కు వెళ్లారు. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేశారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. అప్పటికప్పుడే వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు. పీహెచ్సీ వైద్యులు పరీక్షలు చేయగా, దగ్గరుండి మరీ మందులు పంపిణీ చేయించారు. అనంతరం పాఠశాల ఆవరణలో కలియదిరిగారు. డైనింగ్హాల్లో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శుభ్రంగా ఉండేలా చూడాలని ప్రిన్సిపాల్ మాధవిలతను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పారు. గురుకుల కార్యదర్శి వెంకటరమణతో ఫోన్లో మాట్లాడారు. తరగతి గదులకు పెయింటింగ్ వేయించాలని, గదులు, మరుగుదొడ్ల మరమ్మతుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డార్మెటరీ, తరగతి గది ఒక్కటే కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రత్యేకంగా నివాస గదులు నిర్మించాలని విద్యార్థులు విన్నవించారు.