గంగాధర, జూలై 17: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 11 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 5,25,500 ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, మండలంలోని బూరుగుపల్లిలో ఆదివారం ఆయన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు అట్ల శేఖర్‌రెడ్డి, రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, తోట మల్లారెడ్డి, వేముల అంజి, చిలుముల రమేశ్, దోమకొండ మల్లయ్య పాల్గొన్నారు.
అంబేద్కర్ సంఘం నాయకులకు అభినందన
మండల అంబేద్కర్ సంఘం నాయకులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను బూరుగుపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సంఘం నాయకులు లింగాల దుర్గయ్య, దోమకొండ మల్లయ్య, న్యాతరి శివశంకర్, ద్యావ సంజీవ్, లింగాల లింగయ్య, లంకదాసరి మొండయ్య, మ్యాక వినోద్, గంగాధర రఘు, బొడ్డు మల్లేశం, తాళ్ల లక్ష్మణ్, దొబ్బల లక్ష్మణ్, పొత్తూరి ప్రభాకర్, తాళ్ల రాజేశం, శనిగరపు రమేశ్, గజ్జెల సురేశ్, గొట్టిముక్కల సురేశ్, గంగాధర వేణు, తాళ్ల శ్రీనివాస్, దోమకొండ నారాయణ, బెజ్జంకి ఇసాక్, నమిలికొండ తిరుపతి, రాజు, అనిల్, స్వామి ఉన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు పెన్నిధిగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన నివాసంలో ఆయన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావుతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తెచ్చిందన్నారు. మండలంలోని 14 మంది లబ్ధిదారులకు రూ. 4 లక్షల 22 వేల ఐదు వందల విలువైన చెక్కులను అందించినట్లు తెలిపారు. ఇక్కడ కొక్కెరకుంట విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, ఏఎంసీ వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల వెంకటరెడ్డి, దేశరాజ్‌పల్లి ఎంపీటీసీ వంచ మహేందర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎల్కపల్లి లచ్చయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కలిగేటి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.