కరీంనగర్ రూరల్, జూలై 16 : ప్రస్తుతం కురిసిన వర్షాలతో పత్తి, మక్క పంటల్లో నిలిచిన నీటిని తొలగించి, కలుపు నివార ణ చర్యలు చేపట్టాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి వీ శ్రీధర్‌రెడ్డి రైతులకు సూచించారు. కరీంనగర్ మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన మంద తిరుపతి వ్యవసాయ క్షేత్రాన్ని శనివారం సందర్శించారు. పంట నమోదు యాప్ ద్వారా మం డల వ్యవసాయ అధికారితో కలిసి పరిశీలించారు.
ఇప్పటి వరకు మండలంలోని చామనపల్లి క్లస్టర్లో 2737 మంది, దుర్శేడ్‌లో 3308 మంది, మొగ్దుంపూర్లో 2462 మంది, నగునూర్‌లో 3125 మంది పట్టాదారులుగా నమోదు చేసుకున్నారని తెలిపా రు. కరీంనగర్ మండలంలోని నాలుగు కస్టర్లలో 11,632 మం ది పట్టాదారులున్నారని పేర్కొన్నారు. మండల వ్యవసాయ అధికారి సత్యంకు యాప్‌లో నమోద్పై వివరించారు. గ్రామంలోని పత్తి, మక్కను పరిశీస్తూ నీటిని చిన్న కాలువ ద్వారా తొలగించాలని సూచించారు.
పొటాషియం 15 కేజీ, 25 కేజీల యూరియా ను ఎకరానికి పంట భూముల్లో మొక్కల మొదట్లో వేసుకోవాల ని, తుంగ, వెడల్పాటి ఆకు జాతి మొక్కల నివారణకు ఫైరితయోబిక్ సోడియం, క్విజాల్ ఫాప్ ఇథైల్ మిశ్రమం కలుపు మందులు పిచికారీ చేసుకోవాలని తెలిపారు. వరి నారు మడులపై వివరాలు సేకరించారు. ఉపసర్పంచ్ ఆరె శ్రీకాంత్, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు మంద తిరుపతి, ఊరడి మల్లారెడ్డి, రైతు బంధు గ్రామ కో ఆర్డినేటర్ రాజిరెడ్డి, ఏఈవో పైడితల్లి పాల్గొన్నారు.