వీణవంక, మే 23: గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మల్లారెడ్డిపల్లి, మామిడాలపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో సోమవారం స్థానిక నాయకులతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, ఒకప్పుడు ప్రభుత్వ విద్యకు ఎలాంటి ఆదరణలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి సకల సదుపాయాలు కల్పించాలని సంకల్పించారని చెప్పారు. ఈ మేరకు మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని తీసుకువచ్చి నిధులు వెచ్చిస్తున్నారని తెలిపారు.
త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలకు కొత్త హంగులు సమకూరుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న నిధులతో పాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, దాతలు ముందుకురావాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్‌విండో మాజీ చైర్మన్ మాడ సాధవరెడ్డి, సర్పంచులు బండ సుజాత-కిషన్‌రెడ్డి, మేకల ఎల్లారెడ్డి, ఉప సర్పంచ్ భిక్షపతి, మల్లారెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శి మహేందర్‌రెడ్డి, విద్యాకమిటీ చైర్మన్ దూలం వెంకటేశ్, హెచ్ఎంలు మనోహర్‌రెడ్డి, హైమావతి, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వీణవంక, మే 23: తెలంగాణ రాష్ట్రం ప్రాచీన కళలకు నిలయమని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న చిరుతల రామాయణం నాటక ప్రదర్శనలో భాగంగా సోమవారం శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవ ఘట్టానికి ఎంపీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీతమ్మ పాత్రధారికి చీరె, సారె పెట్టి, రూ.5,016 అందజేశారు. ఇతర కళాకారులను సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ చిరుతల రామాయణం నాటక ప్రదర్శన నిర్వహిస్తున్న కళాబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మహాఅన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లారెడ్డి, ఉపసర్పంచ్ భిక్షపతి, నాయకులు సంది సమ్మిరెడ్డి, ముద్దసాని సమ్మయ్య, దూలం వెంకటేశ్, దూలం సమ్మయ్య, కర్రె నాని, సంది సురేందర్‌రెడ్డి, పెద్దులు, సరస్వతి కళాబృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.