Lebanon | లెబనాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు.. ముగ్గురు మృతి
Lebanon | ఇజ్రాయెల్-హెజ్బొల్లా (Israel-Hezbollah) మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. బీరూట్ (Beirut)లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. దాడికి సంబంధించిన దృశ్యాలను ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం పోస్ట్ చేసింది. బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా బలమైన స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.
Lebanon : ఇజ్రాయెల్-హెజ్బొల్లా (Israel-Hezbollah) మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. బీరూట్ (Beirut)లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. దాడికి సంబంధించిన దృశ్యాలను ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం పోస్ట్ చేసింది. బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా బలమైన స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. పేలుడు సంభవించడంతో భవనం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
లెబనాన్ అధికారిక నేషనల్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. హెజ్బొల్లాకు బలమైన కేంద్రంగా ఉన్న దక్షిణ బీరూట్ శివార్లలోని దాహియేలోని ఘోబెయరీ పరిసరాల్లోని ఓ భవనంపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన సమయంలో అపార్ట్మెంట్ పక్కన ఉన్న రోడ్డుపై వాహనాలు వెళ్తుండటం కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ దాడిలో ఏవైనా వాహనాలు దెబ్బతిన్నాయా అనేదానిపై స్పష్టత లేదు. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్ ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే.. తాము దక్షిణ బీరూట్‌పై దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా పలువురు అధికారులు హెచ్చరించారు.
ఈ నిర్ణయానికి వాషింగ్టన్ మద్దతు కూడా ఉందని వారు పేర్కొన్నారు. హెజ్బొల్లా ప్రయోగించినట్లుగా అనుమానిస్తున్న మూడు డ్రోన్లు ఉత్తర ఇజ్రాయెల్‌పై వేర్వేరు ఘటనల్లో దాడి చేశాయని.. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ సైన్యం ఇవాళ తెల్లవారుజామున తెలిపింది. ఇజ్రాయెల్ భద్రతకు, ఐడీఎఫ్ దళాలకు ముప్పుగా ఉన్న ఏ లక్ష్యాన్నైనా నిర్వీర్యం చేసేందుకు తాము చర్యలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ వైమానిక దళం స్పష్టంచేసింది. హిజ్బుల్లా మాత్రం దక్షిణ లెబనాన్‌లోకి చొరబడ్డ ఇజ్రాయెల్ దళాలపై పలు దాడులు జరిపినట్లు ప్రకటించినప్పటికీ.. ఉత్తర ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

