కొత్తపల్లి, ఆగస్టు 10 : రాష్ట్రంలోని పట్టణాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ ప్రాధా న్యమిస్తున్నదని, కరీంనగర్‌ను ఆనుకొని ఉన్న కొత్తపల్లి పట్టణాన్ని గొప్పగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రూ.6 కోట్ల నిధులతో పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ది పనులు ప్రారంభించాలని మున్సిపల్ చైర్మన్, అధికారులకు సూచించారు.
వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్‌గా అప్‌గ్రేడ్ అయిన కొత్తపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు. అనంతరం మంత్రిని చైర్మన్ శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు వాసాల రమేశ్, జెర్రిపోతుల మొండయ్య, మానుపాటి వేణుగోపాల్, గున్నాల విజయారమేశ్, ఎస్కే నజీయ బాబా, గండు రాంబాబు, చింతల సత్యనారాయణరెడ్డి, వేముల కవితాశేఖర్, జడ్పీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు చెట్టిపల్లి ప్రభాకర్, ఎస్కే షహనాజ్ మునావర్‌ఖాన్, కట్ల సుధాకర్, బండ గోపాల్‌రెడ్డి, జెర్రిపోతుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.