Collector Koya Sri Harsha | పెద్దపల్లి, జూలై 26: పెద్దపల్లి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా తాటి ముంజలతో జామ్ తయారీ సెంటర్ ఏర్పాటుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం ఎన్ఐఎఫ్టీఈఎం ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జామ్ తయారీ సెంటర్ ఏర్పాటు వల్ల గీత కార్మికులకు కలిగే లాభంపై అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 100 లీటర్ల జామ్ తయారీ సెంటర్లను 6 నెలల పాటు నడపాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో ఎం కాళిందిని, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి, ఎల్డీఎం వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.