జగిత్యాల, సెప్టెంబర్ 15: అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పురాణిపేట్ హైసూల్లో పట్టణ ప్రగతి నిధులు రూ. 5లక్షలతో నిర్మించిన సౌచాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చే శామన్నారు. విద్యార్థులకు యూనిఫాంలు, సన్న బియ్యం, పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా రెసిడెన్షియల్ పాఠశాలు ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
జగిత్యాల నియోజకవర్గం లో 25 వేల మంది ఆడబిడ్డలకు బీడీ పెన్షన్ ఇస్తున్నామని, 12 లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి ఇస్తే జగిత్యాల లో 12 వేలకుపైగా ఇచ్చామని వెల్లడించారు. రాష్ట్ర ఏర్పా టు తర్వాత 204 గురుకుల జూనియర్ కళాశాలలు, 17 డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేసి ఆరు లక్షల మంది విద్యార్థులకు విద్య, వసతి, భోజనం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 26 వే ల పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు క ల్పించామన్నారు. నియోజకవర్గంలో రూ.21 కోట్లతో పా ఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు.
కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు పులి రమ, కూసరి అనిల్, కూతురు రాజేశ్ , ప్రిన్సిపాళ్లు రాజయ్య, అనిల్, పట్టణ యూత్ అధ్యక్షుడు గిరి, పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు దుమాల రాజ్‌కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీరామ్ భిక్షపతి, నాయకులు కొలగాని సత్యం, మ హేందర్ రావు, యూత్ నాయకులు కూతురు శేఖర్, వంశీబాబు, గాదె తిరుమల్, ఆరె తిరుపతి, నితీశ్, నూర్ భాషా సంఘం అధ్యక్షుడు అజీజ్, కావేటి నవీన్, పాఠశాల సి బ్బంది చంద్రశేఖర్, జమున, విద్యార్థులు, పేరెంట్స్, తదితరులు పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం
జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 15: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం తాటిపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, తెలంగాణ ప్రభు త్వం సంయుక్తంగా వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండ ర్స్ ఆరోగ్య సంరక్షణకు మొబైల్ మెడికేర్ యూనిట్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ఇండియ న్ రెడ్‌క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలను కొనియాడారు.
భవిష్యత్‌లో మరిన్ని చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేశ్, డాక్టర్ కృష్ణ తేజ, సర్పంచ్ రత్నమాల, శంకర్, నాయకులు ఆంజనేయులు, రాజన్న, వెంకటేశ్, తిరుపతి, రాజేందర్, గిరీశ్, అభి, అబ్దుల్లా, శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.