బీఆర్ఎస్నే గెలిపించాలి
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని, పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రజలను కోరారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియం, ఎస్కేఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్, రోటరీ పార్, ధరూర్ క్యాంప్‌లో ఆదివారం ఆయన వాకర్లు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, యువకులను కలిశారు.
- జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల, ఏప్రిల్ 28: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని, పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రజలను కోరారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియం, ఎస్కేఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్, రోటరీ పార్, ధరూర్ క్యాంప్‌లో ఆదివారం ఆయన వాకర్లు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, యువకులను కలిశారు. కారు గుర్తుకు ఓటు వేసి నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ను గెలిపించాలని కోరారు. మినీ స్టేడియంలో ఓపెన్ జిమ్, ఎస్కేఎన్ఆర్ కళాశాలలో యువకులతో కలిసి సంజయ్‌కుమార్ క్రికెట్ ఆడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రూ.1000 కోట్లతో జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేశామని, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు చేశామని, మహిళా డిగ్రీ కళాశాల అభివృద్ధికి రూ. 5 కోట్లు మంజూరు చేశామన్నారు. మినీ స్టేడియంలో ఓపెన్ జిమ్, రన్నింగ్ ట్రాక్ సైతం ఏర్పాటు చేశామని, ప్రజలకు ఉపయోగంగా మారిందన్నారు. జగిత్యాల నలువైపులా పారులను అభివృద్ధి చేశామని, 18 చోట్ల క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలందుతున్నట్లు తెలిపారు. జగిత్యాలలో ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

