విషాదం..అనుమానాస్పద స్థితిలో తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి
జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో తండ్రి, ఇద్దరు కూతుళ్లు బావిలో పడి మృతి చెందారు.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు..
జగిత్యాల : జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో తండ్రి, ఇద్దరు కూతుళ్లు బావిలో పడి మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గడ్డం జలపతి రెడ్డి (40), ఇద్దరు కూతుళ్లు ప్రణిత్య(10), మధుమిత (9) శుక్రవారం శుభకార్యానికి వెళ్లి తిరిగిరాలేదు. శనివారం ఉదయం మృతుడి సోదరుడు పొలానికి నీరు పెట్టడానికి వెళ్లగా వ్యవసాయ బావిలో పడి ఉన్న జలపతి రెడ్డి ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో జలపతి, ఇద్దరు కూతుర్ల మృతదేహాలను గుర్తించారు. జలపతి వద్ద సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ తో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతుడికి భార్య కవిత, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇందులో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన చిన్నారులు ప్రానిత్య రెండవ తరగతి, మధుమిత నాలుగో తరగతి చదువుతుంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియల్సి ఉంది.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
యువ హాకీ క్రీడాకారుడు గణేష్‌కు ఆర్థిక ప్రోత్సాహం
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

