Metpalli | ప్రతిపక్షాల ఆరోపణలను తొప్పికొట్టాలి : ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు

మెట్పల్లి రూరల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న ఆరోపణలను తొప్పికొట్టాలని ఎమ్మెల్సీ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు భానుప్రసాద్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని వెల్లుల్ల శివారులోని వీఆర్ఎం గార్డెన్స్‌లో టీఆర్ఎస్ మెట్పల్లి పట్టణ, మండల నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది.
దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీలో పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్‌ను విద్యార్థి, ఉద్యమనాయకుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు కేటాయించి, పనిచేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధిష్ఠానం మరోసారి రుజువు చేసిందన్నారు.
అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రచారాన్ని ఖండించాలని, అలాగే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులైన ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును ఎమ్మెల్సీతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, సీనియర్ నాయకుడు కాటిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

