జగిత్యాల : జగిత్యాల పట్టణ 9వ వార్డులో రామాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రోజు వ్యాయాయం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఓపెన్ జిమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
కార్యక్రమంలో వైస్ చైర్మెన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ వొద్ది శ్రీలత, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, కేడీసీసీ జిల్లా మెంబర్ రాం చందర్ రావు, భోగ ప్రవీణ్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రావ్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు టివి సూర్యం, ఆర్టీఏ మెంబర్ సుధాకర్ రావు, డీఈ రాజేశ్వర్,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.