కథలాపూర్ : ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రైతులు రోడ్లపైనే ధాన్యం పోసి కాలబెడుతూ నిరనస వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలోని చింతకుంట రోడ్డు వద్ద రైతులుధర్నా చేపట్టారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతు సంఘాలు చింతకుంట ఎక్స్ రోడ్డు వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగ నినాదాలు చేశారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.