Pandaga Sayanna | అణగారిన వర్గాల ఆకలి తీర్చిన యోధుడు పండగ సాయన్న : కలెక్ట్ సత్య ప్రసాద్
నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య వ్యవస్థ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి, ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపిన బహుజన వీరుడు ప్రజా వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్ 'పండగ సాయన్న' జయంతి ఉత్సవాలను గురువారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు.
జగిత్యాల, అక్టోబర్ 22 : నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య వ్యవస్థ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి, ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపిన బహుజన వీరుడు ప్రజా వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్ ‘పండగ సాయన్న’ జయంతి ఉత్సవాలను గురువారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ బి. సత్యప్రసాద్ హాజరై పండుగ సాయన్న చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజా వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్ గా పిలవబడే పండుగ సాయన్న నిజాం నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా అణగారిన వర్గాల ఆకలి తీర్చేందుకు ఆనాడు నిజం ప్రభువుల ధాన్యం కారాగాన్ని కొలగొట్టి వాటిని పేదలకు పంచి పెట్టేవాడు అని అన్నారు.
ధనవంతుల నుండి, పెట్టు బడుదారుల వ్యవస్థ నుండి భూస్వాముల నుండి, అణగారిన వర్గాలను అణిచివేతకు గురి కాకుండా వారి పై తిరుగుబాటు చేశాడన్నారు. తెలంగాణ ప్రాంత వాసిగా మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టిన పండుగ సాయన్న నిజాం పాలన పై అలుపెరుగని పోరాటం చేశాడని ఆయన చిన్నప్పటి నుండే పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప మహనీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో బీసీ వెల్ఫేర్ అధికారి జయరాజ్, కలెక్టరేట్ ఏ ఓ కిషన్, సిబ్బంది , బీసీ సంఘాల నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

