Odela | ఓదెల, ఆగస్టు 1 : పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర గ్రామీణ అభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ (న్యూఢిల్లీ) జాయింట్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి శనివారం దర్శించుకున్నారు. తన కుమారుడి జన్మదినాన్ని పురస్కరించుకొని ఓదెల మల్లన్న ఆలయంలో స్వామివారి సన్నిధిలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు.
స్వామి వారి మెమొంటోను ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈవో సదయ్య అందజేశారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ మల్లన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో ఆలయ ఫౌండేషన్ సంస్థ ద్వారా తన వంతు సహాయ సహకారాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా దృష్ట్యా తాను కూడా అందులో భాగస్వామ్యం అవుతానని తెలిపారు. మల్లన్న దేవాలయం అత్యంత పురాతనమైనదై అని, కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా వెలసిల్లుతుందని అన్నారు. వెంట పద్మశాలి సంఘం నాయకులు, కొలనూర్ మాజీ ఎంపీటీసీ పరుశ రమేష్, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, పర్ష శ్రీనివాస్, మెరుగు భీష్మ చారి, మెరుగు సారంగం తదితరులు ఉన్నారు.