హుజూరాబాద్ టౌన్, జూన్ 25 : జూలై 3 నుండి 14వ తేదీ వరకు ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరగనున్న 15వ హాకీ ఇండియా సబ్ జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ – 2025 టోర్నమెంట్ కు హుజూరాబాద్‌కు చెందిన తాళ్లపల్లి మేఘన, జంపాల శివ సంతోషిని ఎంపికైనట్లు హుజురాబాద్ హకీ క్లబ్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, సెక్రటరీ బొడిగె తిరుపతి, జిల్లా ఇంచార్జ్ సెక్రటరీ తారిఖ్ హైమద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గత నెల హైదరాబాద్ లోని రైల్వే స్టేడియంలో నిర్వహించిన సబ్ జూనియర్ ఉమెన్ జాతీయస్థాయి ఎంపిక పోటీలో మంచిప్రతిభ కనపరిచినందుకు ఎంపిక చేసినట్లు వారు తెలిపారు. వీరి ఎంపిక పట్ల జిల్లా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ మాజీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, గుడెలుగుల సమ్మయ్య,హాకీ క్లబ్ ఉపాధ్యక్షులు యూసుఫ్, వేముల రవికుమార్, సాదుల శ్యాంసుందర్, రాజేష్ సాయి కృష్ణ, ప్రదీప్, కే రాజేష్, విక్రం కోచ్ విక్రమ్, వినయ్ తోపాటు సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఎంపిక కావడం హుజూరాబాద్ క్రీడా రంగానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.