MLA Padi Kaushik Reddy | వీణవంక, జనవరి 5 : వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మ్యాక సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా మృతుడి కుటుంబాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోమవారం పరామర్శించారు. మ్యాక సమ్మయ్య చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, మాజీ సింగిల్‌విండో డైరెక్టర్ గెల్లు మల్లయ్య యాదవ్, నాయకులు కర్ణకంటి భాస్కర్‌రెడ్డి, గెల్లు రమేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.