Sircilla | అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి.. సిరిసిల్ల వ్యకాస నాయకులు
నివేశ స్థలాలు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ అనుబంధ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
- ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలి
- కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా
Sircilla | రాజన్నసిరిసిల్ల, కలెక్టరేట్ నవంబర్ 26 : నివేశ స్థలాలు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ అనుబంధ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర పిలుపులో భాగంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఇళ్లు లేని పేదలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా బాధ్యులు గుంటి వేణు, సిరిసిల్ల సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే ఇళ్ల స్థలాలు ఉన్నవారికే ప్రాధాన్యతనిస్తూ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తోందని, స్థలాలు లేని నిరుపేదల పరిస్థితిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
సిరిసిల్ల శివారులోని తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్క్, ఇందిరానగర్ పరిధిలో సుమారు వెయ్యి ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేసిన పేదలను గుర్తించి, క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి అర్హులకు ఆ ఇళ్లను కేటాయించాలని కోరారు. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి సరిపోవడం లేదని, ఒక్కో ఇంటికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్లు అర్హులకు అందకుండా అనర్హులకు మంజూరవుతున్నాయని ఆరోపించారు. మరోసారి క్షేత్రస్థాయి విచారణ చేపట్టి అనర్హులను తొలగించి నిజమైన అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మీసం లక్ష్మి, అంజిరెడ్డి, మంజులక్క, శారద, సులోచన తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- allocated
- cpi
- CPM
- House sites
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆకుల అక్షితకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అభినందనలు
Tamil Nadu | గవర్నమెంట్ మేల్ ఎంప్లాయీస్‌కు పెటర్నిటీ లీవ్.. తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం..!
Ramayana | అమిత్ షాను కలిసిన ‘రామాయణ’ చిత్రబృందం.. రణబీర్, సాయిపల్లవిపై ప్రశంసలు
Health tips | వంటల్లో తరచూ ఇంగువ ఉంటే అనారోగ్యాలను పారదోలినట్టే..!
Dr Hassan | విలక్షణ వైద్యుడిగా నవాజుద్దీన్ సిద్దిఖీ.. ‘డాక్టర్ హసన్’ ట్రైలర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

