కమాన్‌చౌరస్తా/ కలెక్టరేట్/ తెలంగాణచౌక్/ హుజూరాబాద్‌టౌన్, /సైదాపూర్/ చిగురుమామిడి, /శంకరపట్నం/ చొప్పదండి/ వీణవంక/ కొత్తపల్లి/ కరీంనగర్ రూరల్, మార్చి 25: హోలీ వేడుకలను జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఇందులో భాగంగా, జిల్లా కేంద్రంలోని పలు డివిజన్లు, మండలాల్లోని గ్రామాల్లో యువత, చిన్నా పెద్దా అందరూ వేడుకల్లో పరస్పరం రంగులు చల్లుకొంటూ సందడి చేశారు. ఉదయం నుంచే ఉత్సాహంతో అన్ని వర్గాల ప్రజలు రంగులు తీసుకొని వీధుల్లోకి వచ్చారు. రంగులు పూసుకొంటూ కేరింతలు కొట్టారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆమె భర్త దీపాంక్ సత్పతి, కుటుంబ సభ్యులు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు.
ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, వివిధశాఖల జిల్లా అధికారులు, టీఎన్జీవో నాయకులు, క్యాంపు, పలు కార్యాలయాల సిబ్బంది, నగరవాసులు, ప్రముఖులు పాల్గొన్నారు. భగత్‌నగర్‌లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో మేయర్ సునీల్ రావు, ఆయన సతీమణి అపర్ణ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. పలువురు స్థానికులు, నాయకులు మేయర్‌కు రంగులు పులిమి శుభాకాంక్షలు తెలిపారు. అంబేదర్ స్టేడియంలో శివ వాకర్స్ అసోసియేషన్ బాధ్యులు గుండ శ్రీనివాస్, భీషపై సింగ్, ఎడ్ల మధు, యాదవ్ శ్రీను, చంద్రం, రాజేందర్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.
తెలంగాణ రచయితల వేదిక, సాహితీ సోపతి ఆధ్వర్యంలో తెలంగాణచౌక్ లో జరిగిన వేడుకల్లో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, సీవీ కుమార్, దామరకుంట శంకరయ్య, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, పెనుగొండ బసవేశ్వర్, యుగేంధర్, మేరుగు ప్రవీణ్, వాసాల రవీందర్, అరుణ్, విలాసాగరం రవీందర్, వేణు, సదాశ్రీ, బూర్ల వెంకటేశ్వర్లు, కందుకూరి అంజయ్య పాల్గొన్నారు. ముకరంపుర పద్మనాయక హాస్టల్లో విద్యార్థినులు హోలీ వేడుకల్లో మునిగి తేలారు. కేరింతలు కొడుతూ రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
జ్యోతీనగర్లో అమ్ము స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు, బీజేపీ నాయకురాలు సుజాతారెడ్డి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు జరిగాయి. అలాగే, జ్యోతీనగర్లోని గణేశ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో స్థానికులు హోలీ సంబురాలు జరుపుకొన్నారు. తెలంగాణ చౌక్‌లో ఫొటో, వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో ఎండీ షుకూర్, దాడి సంపత్‌కుమార్, శైలేందర్ రెడ్డి, కవికుమార్, సుధీర్, సలీమ్, దండు సంపత్, జన్నారం శ్రీనివాస్, ఉదయ్, సుమంత్, రవి, సుధీర్, సదానందం, గీకురు అనిల్, అంజి, రఘు పాల్గొన్నారు. శ్రీపురంలో రాజస్థానీ సేవా సమాజ్, మార్వాడీ యువమంచ్, రాజస్థానీ మహిళా మండల్ ఆధ్వర్యంలో ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
సిక్‌వాడీలోని గురుద్వారా ఎదుట ఖల్సా యూత్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే, ఎస్వీజేసీ జూనియర్ కళాశాలలో బాల బాలికలు హోలీ సంబురాలు ఘనంగా జరుపుకొన్నారు. చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రాంరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగళ సంతోష్ రెడ్డి, విద్యార్థులతో కలిసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌ని క్యాంపు కార్యాలయంలో కలిసి రంగులు పూశారు. ఇక్కడ గోనె శ్రీనివాస్, నంది శ్రీనివాస్, గుగ్గిళ్ల సత్యం, చిటికెన కృష్ణకుమార్, కాండూరి వెంకటేశ్వర్లు ఉన్నారు. టీయూపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి సీహెచ్ వీఎస్ జనార్దన్‌రావుతో కలిసి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు.
ఇక్కడ కట్ట రాజేశ్వర్, అన్నమనేని తిరుపతిరావు, అంబటి వేణు కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని అంగన్వాడీ కేంద్రాల్లో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారుల తల్లులతో కలిసి ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. చిన్నారులకు హోలీ పండుగ ప్రాశస్థ్యం గురించి వివరించారు. కార్యక్రమంలో అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని కోతిరాంపూర్, ఆదర్శనగర్, లక్ష్మీనగర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, తదితర ప్రాంతాల పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆయాలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు. నగరంలోని సీపీఐ పార్టీ కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవనంలో ఘనంగా హోలీ వేడుకలను నిర్వహించారు.
పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు బూడిద సదాశివ మున్సిపల్ కార్మికులతో కలిసి హోలీ ఆడారు. సంబురాల్లో జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. హుజూరాబాద్ క్లబ్ వద్ద జరిగిన వేడుకల్లో మాజీ ఎంపీ కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ క్లబ్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొనగా, 28వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, 7వ వార్డులో వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మలాశ్రీనివాస్, 22వ వార్డులో మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు హోలీ ఆడారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద పలువురు బల్దియా పాలకవర్గ సభ్యులు, పోస్టాఫీస్ వద్ద పోస్టల్ ఉద్యోగులు, బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ కార్యాలయం వద్ద, వాకర్స్ సభ్యులు క్రీడామైదానంలో హోలీ ఘనంగా నిర్వహించుకున్నారు.
జమ్మికుంట పట్టణంలో జరిగిన హోలీ వేడుకల్లో బల్దియా చైర్మన్ టీ రాజేశ్వర్‌రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నాకోటి, కౌన్సిలర్లు, సీఐలు, పోలీసులు, జవాన్లు పాల్గొన్నారు. సైదాపూర్, చిగురుమామిడి మండలకేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో హోలీ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు యువకులు, చిన్నారులు, చిన్నా, పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందోత్సాహాలతో గడిపారు. హోలీ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు ఘనంగా హోలీ సంబురాలు నిర్వహించుకున్నారు.
విశ్వహిందూ పరిషత్ మండలాధ్యక్షుడు పడకంటి కృష్ణ, సభ్యులు చేపూరి సత్యనారాయణ, కటుకం మల్లికార్జున్, దండె లింగన్న, మోలుమురి రమేశ్, దండె మహేశ్, చల్ల అనూష్, జిట్టా కుమార్, అనుకారి సాయికృష్ణ, రఘు, కొకుల కనకయ్య, సిరిపురం శ్రీనివాస్, మోలుమురి రాజేశం, గంగు సంపత్, స్వర్గం కళ్యాణ్, కొత్త సిద్ధార్థ్, పవన్, మనోహర్, యువకులు, తదితరులు పాల్గొన్నారు. రామడుగు మండలంలో జరిగిన హోలీ సంబురాల్లో యువకులు, చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సందడి చేశారు.
వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆయా చోట్ల ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి , జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, వైస్‌ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు హోలీ వేడుకల్లో పాల్గొని మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తపల్లి మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో ఉదయం నుంచి చిన్నారులు, పెద్దలు హోలీ పండుగను సంబురంగా జరుపుకొన్నారు.
ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్గౌడ్ దంపతులకు, మున్సిపల్ రుద్ర రాజు దంపతులకు పలువురు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామంలో జరిగిన హోలీ వేడుకల్లో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, గోపాల్‌పూర్‌లో వైస్ ఎంపీపీ వెల్పుల నారాయణ తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్శేడ్‌లో సింగిల్ విండో చైర్మన్ తోట తిరుపతి వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే చల్మెడ, ప్రతిమ వైద్య కళాలల కళాశాలల వైద్య విద్యార్థులు హోలీ సంబురాలు జరుపుకొన్నారు.