Karimnagar | విజయవాడ కనకదుర్గమ్మకు కరీంనగర్ చేనేత పట్టుచీరల సమర్పణ
అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి నేతృత్వంలో విజయవాడ శ్రీ కనకదుర్గ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి చేనేత వస్త్రాల సమర్పణ శనివారం ఘనంగా నిర్వహించారు.
Karimnagar | కరీంనగర్, (తెలంగాణ చౌక్) అక్టోబర్ 10 : అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి నేతృత్వంలో విజయవాడ శ్రీ కనకదుర్గ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి చేనేత వస్త్రాల సమర్పణ శనివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రాంత పద్మశాలీ సంఘం గౌరవ అధ్యక్షుడు, కరీంనగర్ జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మెతుకు సత్యం సారథ్యంలో 10 రోజులకు గాను 10 చేతులతో నేసిన పట్టు చీరలను అమ్మవారికి సమర్పించారు. చేనేత కళాకారుల చేతి నైపుణ్యంతో తయారైన ఈ చీరలను ఆలయ అర్చకులు అమ్మవారికి అలంకరించనున్నట్లు మెతుకు సత్యం తెలిపారు.
చేనేత వస్త్రాలకు పుట్టినిల్లు పద్మశాలీ కులస్తుల ఆధ్వర్యంలో ప్రతీ ఏటా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ సాంప్రదాయాన్ని చాలా సంవత్సరాలుగా పూర్వీకుల నుండి కొనసాగిస్తున్నామని మెతుకు సత్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలీ సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, వనం విశ్వనాథం, దుష్యంతల, బొళ్ల శివశంకర్, రాపోలు సుధాకర్, బొద్దుల లక్ష్మణ్, గుర్రం శ్రావణ్ కుమార్, గుంటక రూప, మెతుకు మంజుల రాణి, పోరండ్ల శారద, నోముల రేఖ, చిన్నకోట్ల స్వప్న, గుర్రం విశ్వేశ్వర్ రావు, కర్నాటి విజయ్, కైరంకొండ ఉదయ్, మెతుకు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

