కరీంనగర్, మే 18 (నమస్తే తెలంగాణ) : రైతులకు సబ్సిడీపై ప్రభుత్వం పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వా రా జిల్లాలోని వివిధ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు కరీంనగర్ డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ తెలిపారు. జి ల్లాకు 5,520 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువులైన జీ లుగ, జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని ఆయా మండలాలకు కేటాయించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న పచ్చి రొట్ట విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సబ్సిడీ ఇలా..
జీలుగ విత్తనాల పూర్తి ధర క్వింటాలుకు 8,025 కాగా రాష్ట్ర ప్రభుత్వం 5,216 భరిస్తుంది. రైతు లు కేవలం 2,809 చెల్లిస్తే సరిపోతుంది. జను ము పూర్తి ధర క్వింటాలుకు రూ. 8,750 కాగా 5,688 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 3,062 చెల్లించి రైతులు పొందవచ్చు. పచ్చిరొట్ట విత్తనాలు కావల్సిన రైతులు తమ వెంట భూమి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకుని అం దుబాటులో ఉన్న సెంటర్లలో లేదా వ్యవసాయ విస్తరణ అధికారి, మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. కాగా ప్రధాన పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట సాగు చేయడంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ తెలిపారు.
ప్రయోజనాలు..
పచ్చి రొట్ట నేలను కప్పే పంట. పచ్చి రొట్ట ప్రా థమికంగా నేలకు పోషకాలను అందిస్తుంది. సేం ద్రియ పదార్ధాన్ని పెంపొందిస్తుంది. పచ్చి రొట్ట పంటను 30 నుంచి 40 రోజులపుడు పూత దశలో నేలలో కలియ దున్నాలి. తద్వారా నేలలో పోషకాలు సేంద్రియ పదార్థం పెంపొందుతాయి. పచ్చిరొట్ల ఎరువు ద్వారా సేంద్రియ పదార్థం, ఆకు పెంట(హ్యూమస్), నత్రజని పెరుగుతాయి. నేల సత్తువ, నిర్మాణం వృద్ధి చెందుతుంది. నేలకు నీటిని కలిపి ఉంచుకునే శక్తి పెరుగుతుంది. నేత కోతను నివారించి, నేలపై నొరను రక్షిస్తుంది. మొ క్కల వేర్లు బాగా అభివృద్ధి చెంది నేల అట్టడుగు పొరల నుంచి పోషకాలను సంగ్రహించగలుగుతా యి. ఒక ఎకరం భూమిలో పచ్చి రొట్ట పంటను కలియ దున్నడం వలన ఎకరాకు సిఫారసు చేసిన యూరియాలో ఒక బ్యాగు తగ్గించుకోవచ్చు.