తిమ్మాపూర్, సెప్టెంబర్ 21 : తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు మహాత్మా నగర్ గ్రామపంచాయతీ కార్మికులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి తన నివాసంలో ఆదివారం ఉదయం ఘనంగా సత్కరించారు.
బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా పట్టుచీరలు, నూతన వస్త్రాలను పెట్టారు. గ్రామపంచాయతీ సిబ్బంది చేస్తున్న సేవలు గొప్పవని, అందుకే ప్రతీ ఏటా వారిని పండుగ సందర్భంగా బట్టలు పెట్టడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నానని దేవేందర్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు వారు కృతజ్ఞతలు తెలిపారు.