Government teacher suspended | కోరుట్ల, మార్చి 27:పట్టణంలోని ప్రకాశం వీధి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నజీమోద్దీన్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి రాము గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు మండల విద్యాధికారి గంగుల నరేషం తెలిపారు. కాగా ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమార్తె స్థానిక గౌతమ్ మోడల్ స్కూల్లో టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తుండగా అదే పరీక్ష కేంద్రంలో తన సంబంధికులు ఎవరూ లేరని తప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడు. దీంతో ఉన్నతాధికారులు అతడికి ఆ పాఠశాలలో ఇన్విజిలేటర్ గా విధులు అప్పగించారు. ఈ విషయంలో జిల్లా విద్యాధికారి ఇదివరకే సంజాయిషీ నోటీసు అందజేసి గురువారం నిజాముద్దీన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మండల విద్యాధికారి పేర్కొన్నారు.