self-confidence | చిగురుమామిడి, జూలై 17: బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు శారీరక మానసిక సామాజికంగా ఎదగడానికి మార్గాన్ని పరిచయ్ క్యాంపర్ అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ హర్జీత్ కౌర్ అన్నారు. మండలంలోని చిన్న ముల్కనూర్ (ఆదర్శ పాఠశాల) మోడల్ స్కూల్లో విద్యార్థినీలతో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు బాలికల కోసం పరిచయ్ క్యాంపర్ సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
బాలికలు తమ వయసుకు అనుగుణంగా పూర్తి దశలో ఏర్పడే శారీరక మానసిక మార్పులను అర్థం చేసుకోవాలని, వారి హక్కులు భద్రత గురించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. నిజ జీవితంలో సమస్యలు ఎదుర్కొనే ధైర్యం, ఆత్మరక్షణ, మానసిక ఆరోగ్యం, భావోద్వేగాల నిర్వహణపై అవగాహన సదస్సులో బాలికలకు వివరించామన్నారు.
బాలికలు శారీరక మానసికంగా సామాజికంగా అభివృద్ధి కోసం ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. 7 వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థినిలు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి కౌన్సిలర్ గా సి. సంజన, ఎం. సరస్వతి, సంగీత, శిరీష పాల్గొన్నారు.