Indurthi | చిగురుమామిడి, ఆగస్టు 10 : చిగురుమామిడి మండలంలోని గునుకుల పల్లె గ్రామానికి చెందిన చిట్యాల బాల్ రెడ్డి ఇందుర్తి గ్రామపంచాయతీకి తన తండ్రి చిట్యాల పుల్లారెడ్డి స్మారకార్థం రూ.65 వేల విలువగల ఫ్రీజర్ (శవపేటిక)ను గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ చింతపూల నరేందర్‌కు అందజేశారు. ఇందుర్తి గ్రామపంచాయతీ పరిధిలోనే గునుకుల పల్లె ఉండేదని కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీగా ఏర్పడిందన్నారు.
చిన్నతనం నుండి ఇందుర్తి ప్రజలతో గ్రామపంచాయతీతో అవినాభావ సంబంధాలు ఉన్నాయని, గ్రామ ప్రజల ఆదరాభిమానాల ఉన్నాయన్నారు. తన తండ్రి జ్ఞాపకార్థం ఫ్రీజర్ బహూకరణ చేసినట్లు దాత చిట్యాల బాల్ రెడ్డి తెలిపారు. బాల్ రెడ్డి బహూకరణ చేయడం అభినందనీయని సర్పంచ్ నరేందర్ అన్నారు. గ్రామానికి ఎంతో ఉపయోగపడుతుందని, అలాగే వైకుంఠధామం అందించేందుకు దాతలు ముందుకు రావాలని సర్పంచ్ గ్రామస్తులను కోరారు.