medical camp | పాలకుర్తి : పాలకుర్తి మండలం బసంత్ నగర్ వర్కర్స్ క్లబ్ లో మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గురువారం ప్రారంభించారు. ఈ శిబిరంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య, వైద్య సిబ్బంది, నాయకులు పర్సవేణి శ్రీనివాస్, పాత రవీందర్, పోతుల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.