Lions Club | మల్లాపూర్ ఆగస్టు 29: మల్లాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతి రెడ్డి, పీహెచ్ సీ డాక్టర్ వాహిని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెల్మల శ్రీనివాస్ రావు, కార్యదర్శి సురకంటి జైపాల్ రెడ్డి, కోశాధికారి వేములవాడ చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ నల్ల రాజన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పూండ్ర శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.